హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పంజాగుట్ట: పోలీసునంటూ వ్యక్తిపై దాడి! మెడలోని గోల్డ్ చైన్ లాక్కెళ్లాడు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పోలీసునంటూ వచ్చి ఓ వ్యక్తి వద్దకు వచ్చిన ఆగంతకుడు అతడిపై దాడి చేశాడు. ఆ తర్వాత అతని మెడలోని బంగారు గొలుసును లాక్కుని పరారయ్యాడు. ఈ ఘటన గురువారం రాత్రి 10గంటల ప్రాంతంలో నిమ్స్ ఆస్పత్రి వద్ద చోటు చోటుచేసుకుంది.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

వివరాల్లోకి వెళితే.. నిమ్స్ ఆస్పత్రిలో తమ బంధువులు వైద్యం కోసం రావడంతో వారిని పరామర్శించేందుకు మేడ్చల్‌కు చెందిన రవిచంద్ర సింగ్ వచ్చాడు. రవిచంద్ర నగరంలోనే ఓ సంస్థలోప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఆస్పత్రిలో బంధువులను పరామర్శించిన అనంతరం తిరిగి వెళ్లేందుకు నిమ్స్ ఆస్పత్రి బయటకు వచ్చాడు.

fake police theft a chain from a peson in Punjagutta

ఆస్పత్రి ప్రధాన గేటు వద్ద నిల్చుని ఉండగా.. రవిచంద్ర సింగ్ వద్ద వచ్చిన ఓ దుండగుడు తాను పోలీసునంటూ దాడి చేశాడు. అనంతరం అతని మెడలోని బంగారు గొలుసును లాక్కున్నాడు. చూసేంతలోగానే ఆ దుండగుడు అక్కడ్నుంచి పరారయ్యాడు.

రవిచంద్ర వెంటనే పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ తర్వాత రవిచంద్ర నుంచి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించారు.

గురువారం మధ్యాహ్నమే తాను రూ. 30వేలు పెట్టి బంగారు గొలుసు కొనుగోలు చేసినట్లు బాధితుడు రవిచంద్ర పోలీసులకు తెలిపాడు. అందుకు సంబంధించిన రసీదును కూడా చూపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

English summary
fake police theft a chain from a peson at NIMS Hospital in Punjagutta, Hyderabad on Thursday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X