ఎంజే మార్కెట్ వద్ద అగ్నిప్రమాదం
హైద్రాబాద్, ఎంజే మార్కెట్ దగ్గరలోని హిందినగర్ లో ఫర్నిచర్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు ఎసిగిపడుతుండడంతో చుట్టుపక్కల ప్రాంత ప్రజల భయంతో భయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. దగ్గరలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు.దీంతో సుమారు నాలుగు ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పాయి. అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని ,ఎలాంటీ ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.అయితే పెద్ద మొత్తం లో ఆస్తినష్టం జరిగినట్టు పోలీసులు చెప్పారు.













Click it and Unblock the Notifications