వావ్.. ఏమీ రియాక్షన్ గురూ.. ఫస్ట్ డే 5 లక్షల చలాన్లు క్లియర్.. ఫోన్ పే, జీ పే ఉంటేనా..?
చలానా చెల్లించేందుకు వాహనదారులు ఎగబడ్డారు. తొలి రోజు మార్చి 1వ తేదీ మంగళవారం భారీ స్పందన లభించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లలో ఏకంగా రూ.600 కోట్ల పైచిలుకు చలాన్లు పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీటిని రాబట్టుకునేందుకు తెలంగాణ పోలీసు శాఖ భారీ రిబేట్‌తో చలానా క్లియరెన్స్‌కు పిలుపునిచ్చింది. 30 శాతం మొదలు 80 శాతం దాకా రిబేట్ ప్రకటించింది.

ఈ స్థాయిలో రియాక్షన్..
ఈ ఆఫర్‌కు వాహనదారుల నుంచి భారీ స్పందన లభించింది. ఈ నెల 1 నుంచి ఈ నెల 31దాకా గడువు విధించినా... తొలిరోజే వాహనదారులు తమ పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కోసం ఇంట్రెస్ట్ చూపించారు. లక్ష నుంచి 3 లక్షల దాకా వాహనదారులు వస్తారని పోలీసు శాఖ భావించినా.. దానిని మించి ఏకంగా తొలి రోజే 5 లక్షలకు పైగా పెండింగ్ చలాన్లు క్లియర్ అయిపోయాయి.పోలీసు శాఖకు ఏకంగా రూ.5.5 కోట్ల మేర ఆదాయం లభించింది. ఒకేసారి వాహనదారులు పోటెత్తడంతో ఏకంగా ఈ-చలాన్ వెబ్ సైట్ క్రాష్ అయిపోయింది.

కట్టాలనుకున్నారు.. కానీ
మరింత మంది వాహనదారులు తమ పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవాలనుకున్నా.. కుదరలేదు. నెలాఖరులోగా మొత్తం పెండింగ్ చలాన్లు క్లియర్ అయిపోయే అవకాశాలు ఉన్నాయని పోలీసు శాఖ భావిస్తోంది. అయితే పెండింగ్ చలాన్ల చెల్లింపునకు ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే వంటి సేవలను కూడా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. కానీ కేవలం టీ వ్యాలెట్, పేటీఎం, బిల్ డెస్క్ మాత్రమే చూపించింది. దీంతో వాహనదారు విధిగా ఏటీఏం కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. ఇదీ కాస్త ఇబ్బంది కలిగింది. ఒకవేళ ఫోన్ పే, జీ పే ఉంటే మరింత చెల్లింపులు జరిగేవి.

31 వరకు ఛాన్స్
మార్చి 31వ తేదీ వరకు ట్రాఫిక్ చలాన్ల రాయితీ అమల్లో ఉంటుందన్నారు. ద్విచక్ర, మూడు చక్రాల వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై 75 శాతం మాఫీ చేయగా.. 25 శాతం చెల్లిస్తే సరిపోతుంది. ఆర్టీసీ బస్‌లకు 70శాతం, లైట్ మోటార్ వేహికిల్, హెవీ మోటార్ వాహనాలకు 50 శాతం, తోపుడు బండ్లకు 75 శాతం, నో మాస్క్ కేసుల్లో రూ.900 వరకు మాఫీ చేస్తున్నట్లు పేర్కొంది. గత రెండు సంవత్సరాలు కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో జనం ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. ఎక్కువగా పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడుతున్న నేపథ్యంలో పోలీసుశాఖ పెండింగ్ చలాన్లపై రాయితీని ప్రకటించింది.

వెబ్ సైట్ ఇదే
వాహనదారులు ఎలాంటి పడిగాపులు, క్యూలైన్లు, అవసరం లేకుండా తమ జరిమానాలను ఈ-చలానాల వెబ్‌సైట్ https://echallan.tspolice.gov.in/publicviewలో పెండింగ్ చలానాలను రాయితీతో చెల్లించేలా పోలీసు శాఖ పోర్టల్‌ను అప్‌డేట్ చేసింది. ఈ అప్ డేట్ సాఫ్ట్ వేర్ మార్చి1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులోకి ఉంటుంది.












Click it and Unblock the Notifications