కీలక ముందడుగు: ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం, అందుబాటులో డ్వాక్రా మహిళల ఉత్పత్తులు..
ఈ-కామర్స్ దిగ్గజం ప్లిప్ కార్ట్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. డ్వాక్రా మహిళలు రూపొందించే ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో వినియోగదారులకు అందించేందుకు ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లో గల మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో ఒప్పందంపై సెర్ప్ సీఈవో, ఫ్లిప్ కార్ట్ ఉపాధ్యక్షురాలు సంతకాలు చేశారు. ఈ తరహా ఒప్పందాల్లో దేశంలో ఇది మొదటిదని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. ఒప్పందం కుదిరిన తొలి ఏడాదిలో రూ.500 కోట్ల మేర విలువైన డ్వాక్రా మహిళల ఉత్పత్తులను ఫ్లిప్ కార్ట్ తన వినియోగదారులకు విక్రయించనుందని తెలిపారు. ఫ్లిప్ కార్ట్ చేపట్టిన ప్రతీ కార్యక్రమం కూడా సక్సెస్ అయ్యిందన్నారు. ఈ ఒప్పందంతో తెలంగాణ డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరనుందని తెలిపారు.

రూ.15 వేల కోట్ల రుణాలు..
కొత్తగా
ఫుడ్
ప్రాసెసింగ్
యూనిట్లను
నెలకొల్పుతుందని
చెప్పారు.
గతేడాది
రూ.15వేల
కోట్ల
రుణాలు
ఇస్తే..
ఈ
సారి
మహిళా
సంఘాలకు
రూ.18
వేలకోట్లు
రుణాలు
ఇస్తున్నామని
చెప్పారు.
గ్యారంటీ
కూడా
అడగకుండా
బ్యాంకు
మహిళా
సంఘాలకు
రుణాలు
ఇస్తున్నాయని,
ఇది
మహిళా
సంఘాలు
సాధించిన
విజయానికి
సంకేతమన్నారు.

ముందుకు మహిళా సంఘాలు
మహిళా
సంఘాలు
ముందుకు
రావడంతో
దళారుల
వ్యవస్థకు
బ్రేక్
పడిందని
వివరించారు.
మహిళలు
నాణ్యమైన
వస్తువులు
తయారు
చేస్తున్నారని
వివరించారు.
సీజనల్
పండ్లు,
వ్యవసాయ
ఉత్పత్తులను
దళారుల
ప్రమేయం
లేకుండా
నేరుగా
వినియోగదారులకు
చేర్చాలని,
కల్తీ
లేని,
నిఖార్సైన,
నాణ్యమైన
వస్తువులు
విక్రయించాలని
కోరారు.
ప్రస్తుతం
100
రకాల
ఉత్పత్తులను
గుర్తించారని,
మరిన్ని
వస్తువులను
గుర్తించాలన్నారు.

18 వేల కోట్ల రుణాలు
18
వేల
కోట్ల
బ్యాంకర్లు
ఇచ్చిన
రుణాలు
మహిళల
వద్ద
పెట్టుబడి
ఉన్నాయని
గ్రామీణాభివృద్ధి
శాఖ
కార్యదర్శి
సందీప్
కుమార్
సుల్తానియా
తెలిపారు.
ఫ్లిప్‌కార్ట్
ద్వారా
పెద్ద
మార్కెటింగ్
ప్లాట్
ఫామ్
లభిస్తుందన్నారు.
సెర్ప్
సీఓఓ
రజిత,
ఫ్లిప్‌కార్ట్
గ్రోసరీ
వైస్
ప్రెసిడెంట్
స్మృతి
రవిచంద్రన్,
డైరెక్టర్
శరత్
సిన్హా
ఒప్పంద
వివరాలను
వివరించారు.
80కి
పైగా
కేటగిరీలలో
15
కోట్ల
ఉత్పత్తులను
మార్కెటింగ్
చేస్తున్న
ఫ్లిప్‌కార్ట్‌తో
ఒప్పందంతో
ప్రాథమిక
దశలో
100కుపైగా
వస్తువులు
లభ్యం
అవుతాయి.
దీంతో
మహిళా
సంఘాలకు
మేలు
జరుగుతుంది.