Hyderabad: రెస్టారెంట్లలో ఫుడ్ సెఫ్టీ అధికారుల తనిఖీలు..
హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ సెఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతోన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లోని రెస్టారెంట్లు, హోటల్లు, వసతి గృహాలు, పీజీల్లో తెలంగాణ ఆహార భద్రతా విభాగానికి చెందిన టాస్క్‌ఫోర్స్ బృందం సోదాలు చేస్తోంది. హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్లపై దాడులు కొనసాగిస్తోంది. శనివారం ఫుడ్ సెఫ్టీ అధికారులు పలు రెస్టారెంట్లలో తనిఖీలు చేశారు. వనస్థలిపురం గణేష్ నగర్ కాలనీలోని బాలాజీ ఫ్యామిలీ ధాబాలో తనిఖీలు చేయగా, గడువు ముగిసిన బటన్ మష్రూమ్‌లు, తుట్టీ ఫ్రూటీ, భద్రపరచిన కరోండ వంటి పదార్ధాలు బయటపడ్డాయి.
ఫుడ్ హ్యాండ్లర్లు అప్రాన్లు లేదా యూనిఫాంలు ధరించలేదని గుర్తించారు. ముడి ఆహార పదార్థాలు రిఫ్రిజిరేటర్ లోపల అపరిశుభ్రమైన పరిస్థితులలో నిల్వ చేసినట్లు కనుగొన్నారు. అయితే.. హోటల్ సితార గ్రాండ్‌లో ఎలాంటి ఉల్లంఘనలు గుర్తించలేదు. హైదరాబాద్‌లోని రెస్టారెంట్లతో పాటు తెలంగాణలోని పలు పాఠశాలలు, హాస్టళ్లలో ఇటీవల దాడులు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ తనిఖీల సందర్భంగా, వంటగదిలో అనుసరించాల్సిన ప్రోటోకాల్‌లు, ఉత్తమ పద్ధతుల గురించి పరిపాలన, వంట సిబ్బందికి అవగాహన కల్పించారు.

గత కొన్ని నెలలుగా, టాస్క్‌ఫోర్స్ బృందం వివిధ రెస్టారెంట్లు, పీజీలు హాస్టళ్లలో ఆహార నాణ్యతను నిర్వహించేలా తనిఖీలు నిర్వహిస్తోంది. చాలా హెటళ్లు, రెస్టారెంట్లు పరిశుభ్రత పాటించడం లేదు. కుళ్లిన చికెన్, మెటన్ కు మసాల దట్టించి కస్టమర్లకు అందిస్తున్నారు. స్వీట్ షాపుల్లో కూడా ఘోరమైన పరిస్థితులు ఉన్నారు. కృత్రమ కలర్లు ఉపయోగించడం, తేదీ ముగిసిన పదార్థాలు వాడడం కూడా గుర్తించారు.
దీంతో ప్రజలు బయట తినాలంటనే భయపడి పోతున్నారు. ముఖ్యంగా పానీ పూరికి సంబంధించి కూడా భయంకర నిజాలు బయటకు వస్తున్నాయి. పానీ పూరి కోసం ఉపయోగించే పదార్థాలు, కలర్లతో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని గుర్తించారు. కర్ణాటకలో పానీ పూరి శాంపిల్స్ తీసి ల్యాబ్స్ కు పంపించగా.. పానీ పూరి బండి వారు వాడే పదార్థాల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు గుర్తించారు.












Click it and Unblock the Notifications