Hyderabad: స్వీట్ షాపులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు..
హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. సెప్టెంబర్ 13 శుక్రవారం విద్యానగర్ ప్రాంతంలోని తినుబండారాల దుకాణాల్లో ఆహార భద్రత సిబ్బంది తనిఖీ చేశారు. అనేక ఆహార భద్రత ఉల్లంఘనలను గుర్తించారు. సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ చెందిన స్వీట్ షాప్, ఎమరాల్డ్ మిథాయ్ షాప్, ఎటువంటి పెస్ట్ కంట్రోల్ సర్టిఫికేట్ లేకుండా పనిచేస్తున్నట్లు గుర్తించిన సంగతి తెలిసిందే. స్వీట్లు, సావరీస్ ప్రదర్శనలో ఉంచిన స్వీట్ బాక్స్ లపై తయారీ తేదీ లేదా ఉపయోగంతో సహా ఎటువంటి లేబుల్‌లు లేకుండా ఉన్నాయి.
స్వీట్ షాప్‌లోని డస్ట్‌బిన్‌లు ఎలాంటి మూతలు లేకుండా తెరిచి ఉంచినట్లు గుర్తించారు. దుకాణంలో విక్రయించే కొన్ని వస్తువులకు FSSAAI సర్టిఫికేట్ లేదు. ఫుడ్ హ్యాండ్లర్లు ఎలాంటి గ్లౌజులు లేదా ఆప్రాన్‌లు ధరించలేదని అధికారులు తెలిపారు. విద్యానగర్‌లోని సబ్‌వే ఫాస్ట్ ఫుడ్ చైన్ అవుట్‌లెట్‌లో, ఫుడ్ సేఫ్టీ అధికారులు లేబుల్ లేని, సెమీ వండిన పదార్థాలతో సహా అపరిశుభ్రమైన పరిస్థితులను గుర్తించారు. ఫాస్ట్ ఫుడ్ చైన్ అవుట్‌లెట్‌లో ఫోస్టాక్ శిక్షణ పొందిన సూపర్‌వైజర్ లేరని పేర్కొన్నారు.

విద్యానగర్‌లోని గుడ్ ఫ్రెష్ పిజ్జా హౌస్ ప్రాంగణంలో FSSAI రిజిస్ట్రేషన్ కాపీని ప్రదర్శించకుండా నిర్వహిస్తోందని అధికారులు గుర్తించారు. పెస్ట్ కంట్రోల్ రికార్డులు లేదా మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లను అధికారులకు అందించడంలో షాపు వారు విఫలమయ్యారని పేర్కొన్నారు. ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా రెస్టారెంట్లు, హోటళ్లు, వసతి గృహాల్లో తనిఖీలు చేస్తున్నారు. దాదాపు అధికారులు తనిఖీలు చేసిన 90 శాతం రెస్టారెంట్లు, హోటల్లు, వసతి గృహాల్లో సరైన పరిశుభ్రత పాటించం లేదని చెబుతున్నారు.
చాలా వరకు రెస్టారెంట్లలో మిగిలిపోయిన మాంసాన్ని మరో రోజు కస్టకమర్లకు అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మాసాలు వేసి వేయిస్తే రుచిగా ఉంటాయని.. వాటిని వినియోగదారులు తింటే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లేనని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications