Telangana: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి హోటళ్లకు రేటింగ్..!
ఆ మధ్య కాలంలో బయట తినాలంటేనే భయం అవుతుంది. చాలా హోటళ్లు, రెస్టారెంట్లు సరైన పరిశుభ్రత పాటించలేదు. వారి కిచెన్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. దీంతో రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఫుడ్ క్వాలిటీ పెంచేందుకు రెస్టారెంట్లు, హోటల్లకు రేటింగ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నవారు. ఇందుకోసం ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ ఏఐ) ప్రయత్నాలు చేస్తోంది.
రెస్టారెంట్లు, హోటళ్లలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి ఎఫ్ఎస్ఎస్ ఏఐ రేటింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత రేటింగ్ జాబితాను ఆన్ లైన్ లో పొందుపరచనున్నారు. దీంతో కల్తీ ఆహారం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. తనిఖీలు చేసి రేటింగ్ ఇవ్వడం వల్ల ప్రజలకు నాణ్యమైన ఆహారం అందుతుందని చెబుతున్నారు. ఈ రేటింగ్ విధానాన్ని మొదటగా గ్రేటర్ హైదరాబాద్ లో తీసుకొస్తారు. తర్వాత జిల్లాల్లో కూడా అమలు చేస్తారు. హోటళ్లు, రెస్టారెంట్లకు ఇచ్చిన రేటింగ్ లు ఆయా హోటళ్లు బోర్డుపై కనిపించేలా చూసుకోవాలి.

ఈ విధానం అమలుపై ప్రస్తుతం ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి వద్దకు ఫైల్ తీసుకెళ్లనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు 74 వేల రెస్టారెంట్లు, హోటళ్లు ఉన్నాయి. కానీ 23 మంది మాత్రమే ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. 3500లకు పైగా రె స్టారెంట్లకు ఒక ఫుడ్ ఇన్ స్పెక్టర్ ఉన్నారు. అందుకే రెస్టారెంట్లు, హోటళ్లు ఇష్టమొచ్చినట్లు వ్యవహారిస్తున్నాయి. అందుకే ఈ మధ్య కాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు పెంచారు.
చాలా వరకు రెస్టారెంట్ల, హోటళ్లు ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్ తీసుకోకుండానే నడిపిస్తున్నారు. ఇక స్ట్రీట్ ఫుడ్స్ వారికి అయితే ఎలాంటి పర్మిషన్ లేదు. ఈ విధానం అమమల్లోకి వస్తే ఎఫ్ఎస్ఎస్ ఏఐ సర్టిఫికెట్ తీసుకోవాలి. ఇందుకు ఏడాదికి రూ.100 వరకు ఫీజు పె ట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సర్టిఫికేట్ ను ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసుకోవాలి. ఏది ఏమైనా ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలి.












Click it and Unblock the Notifications