• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బిగ్‌బాస్ హౌస్‌లో క‌న్నింగ్ గేమ్ మొద‌లు: సావిత్రితోనే ఆరంభం..!?

|

హైద‌రాబాద్‌: బిగ్‌బాస్ హౌస్‌లో ఆట మొద‌లైంది. ఎవ‌రు ఎలాంటి వారో, వారి మ‌న‌స్త‌త్వాలు ఏమిటో, మూడో కంటి ద్వారా బ‌హిర్గ‌త‌మౌతోంది. వంద‌రోజుల పాటు ఈ బిగ్‌బాస్ హౌస్‌లో ఉంటూ విజేతగా నిలవాల‌నే ప్ర‌య‌త్నంలో వ్యూహాలు, ప్ర‌తివ్యూహాలు ప‌న్నుతుంటారు హౌస్‌మేట్స్‌. తోటి వారిని ఇంటి నుంచి గెంటి వేసే కుట్ర‌లు, కుతంత్రాల‌కు తెర లేచింది. న‌వ్వుతూ ప‌ల‌క‌రిస్తున్న‌ట్టే క‌నిపిస్తుంది గానీ.. అందులో ఎంతో అర్థం ఉంటుంది. ఎప్పుడెప్పుడు హౌస్ నుంచి బ‌య‌టికి నెట్టేద్దామా అనే క‌సి ఆ న‌వ్వులో ద‌ర్శ‌న‌మిస్తుంది.

ఏ చిన్న అవ‌కాశం దొరికిన తోటి హౌస్ మేట్‌ను బిగ్‌బాస్ టైటిల్ పోటీ నుంచి అడ్డు త‌ప్పించాల‌నే కుతంత్రం ఉంటుంది. ఇలాంటి ఎత్తులు, పైఎత్తుల‌కు కొదవే ఉండ‌దు బిగ్‌బాస్ హౌస్‌లో. టీవీ సీరియ‌ళ్ల‌కు మించిన డ్రామాను మ‌నం ఇందులో చూడొచ్చు. ఆ డ్రామా మొద‌టి ఎపిసోడ్‌లోనే ప్రారంభం కావ‌డం.. అది కూడా ఫేమ‌స్ యాంక‌ర్ సావిత్రి అలియాస్ శివ‌జ్యోతి ద్వారా మొద‌లు పెట్టాడు బిగ్‌బాస్‌.

  ఆ శక్తి గల వ్యక్తి ఎవరు?
  Game began: Big Boss Telugu season 3 start with elimination nominations

  ఓ న్యూస్ ఛాన‌ల్ నిర్వ‌హించే తీన్‌మార్ వార్త‌ల ఎపిసోడ్‌కు యాంక‌ర్‌గా, త‌మాషా వార్త‌లను అందించ‌డం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల‌కు సుప‌రిచితురాల‌య్యారు సావిత్రి. బిగ్‌బాస్ మూడో సీజ‌న్ కంటెస్టెంట్‌గా ఎంపిక‌య్యారామె. ఆమె ఎంపికైన వార్త‌ను ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తోన్న అక్కినేని నాగార్జున స్వ‌యంగా ప్ర‌క‌టించ‌డం ఇక్క‌డ ట్విస్ట్‌. చివ‌రికి- ఎలిమినేష‌న్‌కు నామినేట్ చేయాల్సిన బాధ్య‌త కూడా సావిత్రికే అప్ప‌గించిన‌ట్టుంది. అందుకే- తన తోటి హౌస్‌మేట్స్ ర‌వికృష్ణ‌, అషూ రెడ్డి, సావిత్రి వేర్వేరుగా తెలియ‌జేసిన అభిప్రాయాల‌ను క్రోడీక‌రించి ఈ వారం హౌస్ నుంచి బ‌య‌టికి వెళ్లే వారిని ఎంపిక చేశారు బిగ్‌బాస్‌.

  ప్ర‌ముఖ యాంక‌ర్ జాఫ‌ర్‌బాబు, సినీ డాన్స్‌మాస్ట‌ర్ బాబా భాస్క‌ర్‌, శ్రీముఖి, న‌టుడు వ‌రుణ్ సందేశ్‌, ఆయ‌న భార్య వితిక ఎలిమినేష‌న్‌కు గుర‌య్యారు. బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్ర‌వేశించిన కంటెస్టెంట్ల‌లో అత్యంత ప్ర‌మాద‌కారి ఎవ‌రు? వారిని బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎందుకు ఎలిమినేట్ చేయాలి? అన్నింటికీ మించి కంటెస్టెంట్ల వ‌్య‌క్తిగత ప్ర‌వ‌ర్త‌న ఎలా ఉంటుంది? అనే అంశంపై బిగ్ బాస్ ర‌వికృష్ణ‌, అషూరెడ్డి, సావిత్రిల‌కు టాస్క్ ఇచ్చారు. బిగ్ బాస్ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. ఈ ముగ్గురూ తోటి కంటెస్టెంట్ల వ్య‌క్తిగ‌త ప్ర‌వ‌ర్త‌నపై త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు.

  ఈ నివేదిక ఆధారంగా జాఫ‌ర్‌బాబు, బాబా భాస్క‌ర్‌, శ్రీముఖి, వ‌రుణ్ సందేశ్‌, వితిక‌ల‌ను ఎలిమినేట్ జోన్‌లోకి చేర్చారు బిగ్‌బాస్‌. ఈ అయిదుమందిలో ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నేది వేచి చూడాలంటే మ‌రో వారం రోజులు ఆగాల్సిందే. జాఫ‌ర్‌బాబు, బాబా భాస్క‌ర్‌, శ్రీముఖి, వ‌రుణ్ సందేశ్‌, వితికాల్లో ఎవ‌రో ఒక‌రు వచ్చే ఆదివారం ఎలిమినేట్‌కు గురి కాక త‌ప్ప‌దు. ఈ అయిదుమందిలో ఎవ‌రు హౌస్ నుంచి బ‌య‌టికి వెళ్లినా.. దానికి కార‌ణం ర‌వికృష్ణ‌, అషూరెడ్డి, సావ‌త్రి కార‌ణం అవుతారు. మిగిలిన ఇద్ద‌రి సంగ‌తి ప‌క్క‌న పెడితే- సావిత్రి ఇచ్చిన రిపోర్ట్ ఒక్క‌టే బాగా ఘాటుగా ఉంది.

  English summary
  Bigg Boss TV show kick-started today in Telugu. The third season kick-started with Nagarjuna as the TV host. With a total of 15 contestants, the show is going to take place for 100 days. The show started with Nagarjuna reminding the rules, touring the Bigg Boss house. Later, he started inviting the contestants in the house. Bigg Boss assigned a task to Nagarjuna to pick three contestants first out of fifteen. Nagarjuna picked the names of Siva Jyothi (Theenmaar Savitri), TV Serial actor Ravi Krishna and social media fame Ashu Reddy.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X