హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: కరోనా ఆస్పత్రిగా గాంధీ దవాఖాన: మంత్రి ఈటల, 16 రాష్ట్రాల్లో కూడా..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. దీంతో 17 రాష్ట్రాల్లో కరోనా వైరస్‌కు చికిత్స అందించే ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం పిలుపుమేరకు తెలంగాణలో గాంధీ ఆస్పత్రిని కరోనా హాస్పిటల్‌గా మార్చబోతున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే గాంధీ దవాఖాన కరోనా నోడల్ సెంటర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఇకపై కరోనా వైరస్‌కు సంబంధించిన చికిత్సలు అందించబోతున్నారు.

సెకండ్ స్టేజ్..

సెకండ్ స్టేజ్..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ రెండో స్టేజీలో ఉంది. పాజిటివ్ సోకిన వారి సంఖ్య 44కి చేరుకుంది. వైరస్ మరింత ప్రబలకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిని కరోనా హాస్పిటల్‌గా మార్చాలని డిసిషన్ తీసుకుంది. ఇప్పటికే ఇక్కడ ఓపి నిలిపివేసిన సంగతి తెలిసిందే. సర్జరీలు కూడా ఉస్మానియా ఆస్పత్రికి పంపిస్తున్నారు.

సదుపాయాలు..

సదుపాయాలు..

కరోనా కోసం వైద్యం అందించే గాంధీ ఆస్పత్రిలో ఆ మేరకు సదుపాయాలు సమకూరుస్తున్నారు. రోగికి వైద్యం అందించే సమయంలోవేసే ఫంక్షనల్ ప్రొటెక్టివ్ కిటస్, ఎన్ 95 మాస్క్, వెంటిలెటర్లను భారీగా తీసుకొచ్చారు. వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. వైద్యాశాఖ ఉన్నతాధికారుల సమీక్షలో నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.

రోజు 700 పరీక్షలు..

రోజు 700 పరీక్షలు..


గాంధీ ఆస్పత్రితోపాటు నల్లకుంటలో గల ఫీవర్ ఆస్పత్రి, చెస్ట్ ఆస్పత్రిలో కరోనా పాజిటివ్ కేసులకు చికిత్స అందిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో గల వైరాలజీ సెంటర్‌లో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ, వరంగల్ ఆస్పత్రిలో రోజుకు వంద శాంపిల్స్ టెస్ట్ చేస్తున్నారు. సీసీఎంబీకి అనుమతి రావడంతో రోజుకు 700 కరోనా వైరస్ టెస్టులు చేసుకొనే వెసులుబాటు కలగనుంది.

17 రాష్ట్రాల్లో కరోనా ఆస్పత్రులు..

17 రాష్ట్రాల్లో కరోనా ఆస్పత్రులు..

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో 17 రాష్ట్రాల్లో కరోనా ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీచేసింది. దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుందని, కానీ వాటి పెంపు సంఖ్య మాత్రం స్థిరంగా ఉందని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. సోషల్ డిస్టన్స్ ముఖ్యమని, దానితోనే వైరస్‌ను సంపూర్ణంగా పారద్రోలచ్చు అని స్పష్టంచేశారు.

English summary
Health Ministry directs 17 states to set up COVID-19 dedicated hospitals Joint Secretary of the Health Ministry Lav Aggarwal Thursday said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X