ఏక్ షామ్ చార్మినార్ కే నామ్ - అక్కడా సండే- ఫన్‌డే : ఓల్డ్ సిటీలోనూ కొత్త తరహాలో..!!
కరోనా తగ్గముఖం పట్టిన తరువాత హైదరాబాద్ పరిధిలో పబ్లిక్ కు ఎంజాయ్ మెంట్ అందించేందుకు ప్రభుత్వం-హెచ్ఎండీఏ కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. దుర్గం చెరువు వద్ద కేబుల్ వంతెన కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక, కొద్ది రోజులుగా ట్యాంక్ బండ్ పైన సండే- ఫన్‌డే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి సైతం ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. పెద్ద సంఖ్యలో కుటుంబ సమేతంగా నగరవాసులు ట్యాంక్ బండ్ కు చేరుకొని ఆస్వాదిస్తున్నారు. దీని కోసం అక్కడ ట్రాఫిక్ ను ప్రతీ ఆదివారం మధ్నాహ్నం నుంచి రాత్రి వరకు నిలిపివేస్తున్నారు.

సండే ఫన్ డే కు అనూహ్య స్పందన
దీంతో..పాటుగా లేజర్ షో లు. ..లైటింగ్ లు ఏర్పాటు చేసారు. స్టాల్స్..ఫుడ్ ట్రాక్స్ స్పెషల్ అట్రాక్షన్ నిలుస్తున్నాయి. అంతేకాదు హుస్సేన్ సాగర్‌పై లేజర్ షోతో పాటు ట్యాంక్‌బండ్‌పై అన్ని వైపులా ప్రేక్షకుల గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. న్యూ యార్క్ నగరానికి 'లిబర్టీ ఐల్యాండ్'... లండన్ నగరానికి 'ట్రాఫాల్‌గర్ స్కేర్'... మాదిరిగా హైదరాబాద్ నగరానికి ట్యాంక్‌బండ్ ఒక మణిహారం. అలాంటి ట్యాంక్ బండ్‌ను అత్యాధునిక హంగులతో, వారసత్వ శోభతో ఆకట్టుకొనేలా తీర్చి దిద్దాలనేది ప్రభుత్వ ఆలోచన.

ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం
ట్యాంక్ బండ్ సుందరీకరణ పనుల్లో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) సుమారు రూ.27 కోట్ల రూపాయలను వెచ్చిస్తోంది. ఇప్పటికే 90 శాతం సుందరీకరణ పనులు పూర్తయ్యాయి. ఫుట్‌పాత్ ఆధునీకరణ పనులకు మొత్తం రూ.14.50 కోట్లను ఖర్చు చేయగా, రూ.12.50 కోట్లతో హేరిటైజ్ శైలిలో విద్యుత్ దీపాలంకరణను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో చార్మినార్ వద్ద కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో చార్మినార్ ప్రాంతాన్ని అర్బన్ డెవలప్‌మెంట్ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, సీపీ అంజనీ కుమార్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పరిశీలించారు. సండే - ఫన్‌డే ఏర్పాట్లపై సమీక్షించారు. కల్చరల్ ఈవెంట్స్ నిర్వహణతో పాటు పార్కింగ్ ఏర్పాట్లపై చర్చించారు.

ఈ వారం నుంచి చార్మినార్ వద్ద సైతం
చార్మినార్ వద్ద కూడా సండే - ఫన్‌డే నిర్వహించాలని ఎంపీ అసద్ కోరటంతో మంత్రి కేటీఆర్ వెంటనే ఆమోదం తెలిపారు. అక్కడ సైతం పాత నగర శోభను..సంప్రదాయాలను ప్రదర్శిస్తూ.. పన్ డే ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే ఆదివారం నుంచి అక్కడ సైతం ఫన్ డే ప్రారంభం కానుందని ప్రభుత్వం ప్రకటించింది. ట్యాంక్‌బండ్‌పై ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సండే-ఫండేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో స్టాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు ఎందరో ఉత్సాహం కనబరుస్తున్నారు.

ఏక్ షామ్ చార్మినార్ కే నామ్
దీంతో సండే-ఫండే సందర్భంగా స్టాళ్లు ఏర్పాటు చేసుకోవాలనుకునేవారు.. ముఖ్యంగా హస్తకళలు, చేనేత సంబంధిత, ఈటరీస్ తదితర స్టాళ్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా హెచ్‌ఎండీఏ ఆహ్వానిస్తోంది. దీంతో..అటు జంట నగరాల వారధి ట్యాంకు బండ్ తో పాటుగా హైదరాబాద్ కు ఆనవాళ్లు అయిన చార్మినార్ వద్ద ఇక ప్రతీ ఆదివారం ఫన్ డేనే. దీంతోపాటు స్థానిక కళాకారులను ప్రోత్సహించేందుకు సంగీతం తదితర కళారూపాలను ప్రదర్శించాలనుకునే వ్యక్తులు, గ్రూపులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని హెచ్‌ఎండీఏ పేర్కొంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications