Hyderabad: హైదరాబాద్‍లో ఇన్ని కుక్కలున్నాయా.. జీహెచ్ఎంసీకి గంటకు 416 ఫిర్యాదులు..
కుక్కల సమస్య పరిష్కరించాలంటూ జీహెచ్ఎంసీకి గంటకు 416 ఫిర్యాదులు వస్తున్నాయి.
జీహెచ్ఎంసీకి కుక్కలు తిప్పలు పెరుగుతున్నాయి. తమ వీధుల్లో కుక్కలున్నాయంటూ ఫిర్యాదులు మీద ఫిర్యాదులు రావడంతో జీహెచ్ఎంసీ సతమతమవుతోంది. బల్దియాకు కేవలం36 గంటల్లోనే15 వేల ఫిర్యాదులు వచ్చాయి. సగటున గంటకు 416 ఫిర్యాదులు వస్తున్నాయి. అంబర్ పేట్ బాలుడి ఘటన తర్వాత సిటీలో కుక్కల సమస్యపై ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు.

500 వీధి కుక్కలు
జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని జోన్లలో ఇప్పటివరకు 500 వీధి కుక్కలను జీహెచ్ఎంసీ సిబ్బంది పట్టుకున్నారు. అయితే నగరంలో 5 లక్షలకు పైగా కుక్కలున్నట్లు అంచనా వేశారు. వీటిని పట్టుకోవాలంటే సమయం పడుతుందని చెబుతున్నారు. అయితే అంబర్ పేటలో బాలుడిపై కుక్కలు దాడి చేసి చంపిన తర్వాత నగరంలో ఆందోళన నెలకొంది.

గంగాధర్
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయికి చెందిన గంగాధర్ ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వచ్చారు. నాలుగేళ్లుగా అంబర్ పేట ఛే నెంబర్ చౌరస్తాలో ఉన్న ఓ కారు సర్వీస్ సెంటర్ లో వాచ్ మెన్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఆయనకు భార్య జనప్రియ, ఆరేళ్ల కూతురు, నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. వారు బాగ్ అంబర్ పేటలోని ఎరుకల బస్తీ ఉంటున్నారు. ఆదివారం పిల్లలకు సెలవు కావడంతో కుమార్తె, కొడుకు ప్రదీప్ ను తాను పని చేస్తున్న సర్వీస్ సెంటర్ కు తీసుకొచ్చాడు. బిడ్డను పార్కింగ్ వద్ద ఉన్న క్యాబిన్ లో ఉంచి.. కుమారుడిని లోపలికి తీసుకెళ్లాడు గంగాధర్.

ప్రదీప్ పై దాడి
ఏదో పనిపై గంగాధర్ మరో వాచ్ మెన్ తో కలిసి బయటకు వెళ్లాడు. ప్రదీప్ కు ఇక్కడే ఉండు అని చెప్పి వెళ్లాడు. ప్రదీప్ అక్కడే ఉండక.. పార్కింగ్ వద్ద ఉన్న అక్క వద్దకు బయల్దేరాడు. ఈ క్రమంలో బాలుడు నడిచి వస్తుండగా.. కుక్కలు మీదికి వచ్చాయి. ప్రదీప్ తప్పించుకునే ప్రయత్నం చేయగా.. కుక్కలు వదిలిపెట్టలేదు. ప్రదీప్ పై దాడి చేశాయి. అయితే ప్రదీప్ అరవడంతో చుట్టు పక్కల వారు వచ్చి కుక్కలను వెళ్లగొట్టారు.
సీసీ కెమెరా దృశ్యాలు
వెంటనే అక్కడికి చేరుకున్న గంగాధర్ కుమారుడిని ఆస్పత్రికి తరలించాడు. కానీ ప్రదీప్ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కుక్కలు తీవ్రంగా గాయపరచడంతో ప్రదీప్ ప్రాణాలు విడిచాడు. బాలుడిపై కుక్కలు దాడి చేసే ఘటన దృశ్యాలు అక్కడే సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కొడకు మృతితో గంగాధర్ కన్నీరుమున్నరయ్యారు. అనవసరంగా పిల్లలను ఇక్కడి తీసుకొచ్చానని బోరున విలపించారు.

రాంగోపాల్ వర్మ
నగరంలోని అంబర్‌పేటలో ఇటీవల వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ ప్రాణాలు కోల్పోయిన ఘటన అందర్నీ కలిచివేసింది. ఈ ఘటనపై నలువైపుల నుంచి పాలకవర్గంపై ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై తాజాగా ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తీవ్రంగా స్పందించారు.వీధి కుక్కల నియంత్రణలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) విఫలమైందంటూ విమర్శించారు.
వరుస ట్వీట్లు
కుక్కలకు ఆకలి వేయడం వల్లే చిన్నారిపై దాడి చేశాయి అని హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇచ్చిన వివరణపై రాంగోపాల్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు. గతంలో విజయలక్ష్మి తన పెంపుడు కుక్కతో కలిసి ఉన్న వీడియోను షేర్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.












Click it and Unblock the Notifications