స్పీకర్ వద్దే తేల్చుకొండి, జోక్యం చేసుకోలేం.. బీజేపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు సూచన
హైకోర్టులో బీజేపీ ఎమ్మెల్యేలకు చుక్కెదురు అయ్యింది. ఆశించిన న్యాయం జరగలేదు. సభా వ్యవహారాలు.. అసెంబ్లీలో, స్పీకర్ వద్ద తేల్చుకోవాలని కోర్టు సూచించింది. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. బీజేపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు పలు సూచనలు చేసింది. అసెంబ్లీ ప్రారంభానికి ముందే.. స్పీకర్ దగ్గరికి వెళ్లి తమ వాదనలు వినిపించాలని తెలిపింది. ఎమ్మెల్యేల అభ్యర్థనను స్పీకర్ పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. సస్పెండెడ్ ఎమ్మెల్యేలను రేపు అసెంబ్లీ సెక్రటరీ దగ్గరు ఉంది స్పీకర్ దగ్గరకు తీసుకెళ్లాలని హైకోర్టు సూచించింది.

స్పీకర్ వద్దే..
సభకు గౌరవ అధ్యక్షుడు స్పీకరేనని హైకోర్టు స్పష్టం చేసింది. బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు రిప్రజెంట్ చేసుకోవాలని హైకోర్టు సూచించింది. రేపు ఉదయం లోపు స్పీకర్ ముందు సస్పెండ్ అయిన ఎమ్మేల్యేలు స్పీకర్ ముందు హజరవ్వాలని హైకోర్టు తెలిపింది. హైకోర్టు అదేశాల ప్రకారం రేపు ఉదయం అసెంబ్లీ ప్రారంభమయ్యే లోపే స్పీకర్ ముందు ఎమ్మెల్యేలు అభ్యర్థన చేసుకోవచ్చని వెల్లడించింది. సభాధిపతిగా సమస్యను పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.

ఆధారాలు లేవు.. కానీ
పార్లమెంటరీ డెమోక్రసీ అని హైకోర్టు పేర్కొంది. సభలో ప్రజా ప్రతినిధులు ఉంటేనే పార్లమెంట్ డెమోక్రసీ బలపడుతుందని పేర్కొంది. బీజేపీ ఎమ్మెల్యేలు సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్టు ఎటువంటి ఆధారాలు లేవని హైకోర్టు అభిప్రాయపడింది. ఆర్టికల్ 14, 19, 21 ప్రకారం సభ్యుల హక్కులకు భంగం వాటిల్లుతుందని తెలిపింది. గతంలో పలు కోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు కలగచేసుకోవచ్చని హైకోర్టు పేర్కొంది.

స్టే ఇవ్వలేం
బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై మార్చి11న తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ పై స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై స్టే ఇవ్వడానికి నిరాకరించింది.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కల్గించారని బీజేపీ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ విధించారు. తామ విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సభ ముగిసే వరకు సస్పెన్షన్ ఎత్తివేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు కోరారు. దీనిపై స్టే ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications