ప్రభుత్వ ఆసుపత్రులు పేదలకు వరం.!కేసీఆర్ కిట్ అద్బుతమైన పథకమన్న ఎర్రబెల్లి.!

హనుమకొండ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించిర తర్వాత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ప్రభుత్వ దవాఖానాలు పటిష్టమవ్వడమే కాకుండా, నాణ్యమైన చికిత్స అందిస్తూ పేదల పెన్నిధిగా మారాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

ఆర్మూరు జిల్లా కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న శ్రీమతి రాచర్ల శాలిని హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి దవఖానాలో ప్రసవించి, పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో నేడు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కలిసి ఆమెను, వారి కుటుంబ సభ్యులను అభినందించారు. కేసీఆర్ కిట్ అందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

Government hospitals are a boon to the poor.KCRs kit is a wonderful project. -Errabelli

వరంగల్ జిల్లాలో ప్రైవేట్, ప్రభుత్వ హాస్పిటల్లను రివ్యూ చేసినప్పుడు ప్రభుత్వ దవఖానాలలో నార్మల్ డెలివరీలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రభుత్వ ఆసుపత్రులలో 80 నుంచి 90 శాతం వరకు ఆపరేషన్లు లేకుండా నార్మల్ డెలివరీలు జరుగుతుండగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో 60 నుంచి 70 శాతం ఆపరేషన్లు జరుగుతున్నట్లు నివేదిక నిరూపిస్తున్నాయన్నారు మంత్రిది. భవిష్యత్తులో ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేటట్లు చూస్తామన్నారు మంత్రి ఎర్రబెల్లి.

జిల్లా జడ్జిగా ఉండి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించడం ప్రజలకు ఒక మంచి సందేశాన్ని అందించిందని శ్రీమతి రాచర్ల శాలిని ని ప్రశంసించారు. ప్రభుత్వ దవాఖానాలు చికిత్సలు బాగా అందిస్తూ, పేదల పెన్నిధిగా మారాయన్నారు. కెసిఆర్ కిట్ కింద ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన వారికి 12 వేల రూపాయలు అందిస్తున్నామని, తెలంగాణలో మినహా దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఈ పథకం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+