జనం కంటిపాపలపై కేర్.. 50 లక్షల మందికి పరీక్ష: మంత్రి హరీశ్ రావు

సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంగతి తెలిసిందే. దాంతో అర్హులకు మేలు జరుగుతుంది. అలాంటి స్కీమే కంటి వెలుగు.. అవును తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకం అమలవుతున్న సంగతి తెలిసిందే. అవసరమైన వారికి మందులు లేదంటే అద్దాలు.. మరీ అవసరమైతే ఆపరేషన్ చేయిస్తారు. ఈ స్కీమ్ జనాల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రంలో గల ప్రతీ ఒక్కరీ హెల్త్ ప్రొఫైల్ చేస్తున్నారు. దీంతో జనం ఆరోగ్య సమస్యలు బయటపడతాయని ప్రభుత్వం చెబుతోంది.

5 నెలల్లో 50 లక్షల మందికి పరీక్ష

5 నెలల్లో 50 లక్షల మందికి పరీక్ష

కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ప్రజలకు కంటి పరీక్షలు చేసిన ఘనత సీఎం కేసీఆరే‌కు దక్కుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. కంటి వెలుగు ద్వారా 5 నెలల్లో కోటి 50 లక్షల మందికి కంటి పరీక్షలు చేశామని వివరించారు. సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో వరల్డ్ గ్లూకోమా డే వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. కరోనా సమయంలో పనిచేస్తూ మరణించిన ANM వరలక్ష్మి అనే మహిళ కుటుంబానికి రూ. 50 లక్షలు ఇన్సూరెన్స్ చెక్‌ని అందించారు.

భేష్..

భేష్..

ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున డెలివరీలు జరుగుతున్నాయని తెలిపారు. కరోనాలో సమయంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అద్భుతంగా పని చేశారని ప్రశంసించారు. అక్కడక్కడ వృత్తిలో ప్రాణాలను కూడా కొల్పోయారని, ఇప్పటి వరకు 45 కోట్ల రూపాయలను చనిపోయిన వారి కుటుంబాలకు అందజేశామని వివరించారు. ప్రజలకు గ్లూకోమా గురించి అవగాహన కల్పించాలని, ఈ వ్యాధి వచ్చినట్టు కూడా తెలియదన్నారు. ఈ వ్యాధి వస్తే కంటి చూపుని కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

వారికే ఎక్కువ

వారికే ఎక్కువ


బీపీ, షుగర్ ఉన్నవాళ్లలో ఈ వ్యాధి ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 40 సంవత్సరాలు దాటిన వారిల్లో బీపీ, షుగర్ 3 శాతం ఉందన్నారు. సరోజినిదేవి కంటి ఆసుపత్రిపై త్వరలో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్రజల ఆరోగ్యమే తమకు ఇంపార్టెంట్ అని చెప్పారు. అందుకోసమే హెల్త్ ప్రొఫైల్ చేస్తున్నామని తెలిపారు. దీంతో అనారోగ్యం గురించిన సమాచారం తెలుస్తోందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+