గ్రేటర్ ఎన్నికల వేళ.. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ పోలింగ్ కొనసాగుతోంది . ఇప్పటివరకు ఓటర్లు పెద్దగా పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చిన దాఖలాలు లేవు . ఈసారి అన్ని రాజకీయ పార్టీలు ఈ నేనికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి . గ్రేటర్ హైదరాబాద్ లో ఒకవైపు ఎన్నికలు జరుగుతున్న సమయంలో హైదరాబాద్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పారిశ్రామిక వాడ ఫేజ్ 4 లో హైటెక్ అలుకాస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది.

హైటెక్ అలుకాస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు సెలవు దినం కావడంతో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో కార్మికులు ఎవరు పని చేయడం లేదు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అగ్నిప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు.

Greater Election time.. Fire accident in Jeedimetla Industrial Estate

ఈ ప్రమాదంలో సుమారు ఐదు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని కంపెనీ యాజమాన్యం అంచనా వేస్తోంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమిటో ఇప్పటివరకు ఇంకా తెలియ రాలేదు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా, లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే పనిలో పడింది కంపెనీ యాజమాన్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+