హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి చరిష్మా తగ్గిందా ? కాంగ్రెస్ ఓటమికి కారణాలెన్నో .. నేతల్లో అంతర్మధనం !!

|
Google Oneindia TeluguNews

జిహెచ్ఎంసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మరోమారు ఊహించని దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన 146 స్థానాలలో కేవలం రెండు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ నేతలను షాక్ కు గురి చేస్తుంది. మెజారిటీ డివిజన్లలో నామమాత్రపు పోటీ ఇచ్చి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మూడవ స్థానానికి పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు గా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ల వ్యూహం ఏ మాత్రం పని చేయలేదు.

 గ్రేటర్ లో గులాబీ హవా.. పాలాభిషేకాలు , సంబరాలు షురూ .. గ్రేటర్ మేయర్ పీఠం టీఆర్ఎస్ దే .. గ్రేటర్ లో గులాబీ హవా.. పాలాభిషేకాలు , సంబరాలు షురూ .. గ్రేటర్ మేయర్ పీఠం టీఆర్ఎస్ దే ..

 మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో రెండు స్థానాలకే పరిమితం అయిన కాంగ్రెస్

మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో రెండు స్థానాలకే పరిమితం అయిన కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ అయిన రేవంత్ రెడ్డి చరిష్మా మసకబారింది అనే టాక్ వినిపిస్తోంది.

కనీసం ఎంపీ రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 48 డివిజన్ లు ఉండగా రెండు చోట్ల మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలవడం విస్మయానికి గురిచేస్తుంది. మల్కాజ్ గిరి నియోజకవర్గంలో కూడా పార్టీ అభ్యర్థులను రేవంత్ గెలిపించాలేకపోయారనే విమర్శలు వెల్లువగా మారాయి. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా రేవంత్ రెడ్డి చరిష్మా బాగా తగ్గింది అన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

కాంగ్రెస్ లో సమన్వయ లోపం , ముందు చూపు లేకపోవటం వంటి కారణాలెన్నో

కాంగ్రెస్ లో సమన్వయ లోపం , ముందు చూపు లేకపోవటం వంటి కారణాలెన్నో


ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమన్వయ లోపం, ఎన్నికలకు ముందస్తుగా ప్రణాళికాబద్ధంగా సిద్ధం కాకపోవడం, ముందు చూపు లేకపోవడం, అభ్యర్థుల ఎంపికలో గందరగోళం చోటుచేసుకోవడం, సంస్థాగతంగా బలంగా లేకపోవడం వంటి అనేక కారణాలు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో చావుదెబ్బ కొట్టాయి.

దుబ్బాక ఎన్నికల్లో ఓటమి ప్రభావం కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పై పడింది అని చెప్పడం నిర్వివాదాంశం.

బలమైన అభ్యర్థుల గుర్తింపులోనూ ఫెయిల్

బలమైన అభ్యర్థుల గుర్తింపులోనూ ఫెయిల్

ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థులను గుర్తించటంలో ఫెయిల్ అయింది. బల్దియా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసినా, దానిని పూర్తిస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి లేకపోయింది. అంతేకాదు ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా వెనకబడింది. మరోపక్క పోటీలో ఉన్న జాతీయ పార్టీ దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ నాయకులను ఎన్నికల ప్రచారానికి ఆహ్వానించి ప్రచారాన్ని హోరెత్తిస్తే , కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినప్పటికీ జాతీయ స్థాయి నాయకులను ప్రచారం కోసం రంగంలోకి దించలేకపోయింది.

 ఎన్నికల బాధ్యత భుజాన వేసుకుని తిరిగిన నాయకుల్లేరు

ఎన్నికల బాధ్యత భుజాన వేసుకుని తిరిగిన నాయకుల్లేరు

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసిన బలమైన నాయకులు ఎవరూ కనిపించలేదు. పార్టీ గెలుపు కోసం ఎన్నికల బాధ్యతను భుజాన వేసుకుని తిరిగి నాయకులు కూడా లేరు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించడం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం అన్న భావన వ్యక్తమవుతోంది. గ్రేటర్ పరిధిలో 2018 శాసనసభ ఎన్నికల్లో ఎల్బీనగర్, మహేశ్వరంలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కానీ ఈసారి ఆ రెండు స్థానాలను కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది.

Recommended Video

GHMC Results : Uttam Kumar Reddy Resigns As chief Of Telangana Congress
కాంగ్రెస్ ఓటమితో నేతల్లో అంతర్మధనం .. ఉత్తమ్ టీపీసీసీ చీఫ్ గా రాజీనామా

కాంగ్రెస్ ఓటమితో నేతల్లో అంతర్మధనం .. ఉత్తమ్ టీపీసీసీ చీఫ్ గా రాజీనామా

హస్తం హస్తగతం చేసుకున్నది కేవలం రెండు సీట్లు కావడంతో కాంగ్రెస్ పార్టీల నేతలు ఇప్పుడు మల్లగుల్లాలు పడుతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే పార్టీలో కొనసాగాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న అనేక విషయాలు ఓటమికి కారణమని తెలిసికూడా మీడియా వల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అంటూ వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టి, పార్టీ శ్రేణులు ఏకతాటి మీద నడిపించక పోతే భవిష్యత్తులో టీడీపీలా , కాంగ్రెస్ పార్టీ కూడా మనుగడ కోల్పోయే ప్రమాదం ఉంది.

English summary
The GHMC elections dealt another unexpected blow to the Congress party. The victory of the Congress candidates in only two of the 146 seats contested by the Congress candidates came as a shock to the leaders of the Congress, the national party. Giving nominal competition in majority divisions, the Congress party slipped to third position in the state of Telangana. Congress Working Party President Revanth Reddy and former state president Uttam Kumar Reddy's strategy did not work.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X