మాదాపూర్ రోహిణి కమర్షియల్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోహిణి కమర్షియల్ కాంప్లెక్స్‌లో శనివారం రాత్రి ఈ ప్రమాదం సంభవించింది. పై అంతస్థులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న పోలీసులు స్థానికులను భవనం వైపు రాకుండా చర్యలు తీసుకున్నారు. అయితే అగ్ని ప్రమాదం జరిగిన ఫ్లోర్‌లో సాఫ్ట్ వేర్ సంస్థ ఉందని స్థానికులు చెబుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో కలిసి మంటలు అదుపు చేశారు. కాగా, ఏసీలో షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల మంటలు వ్యాపించినట్లు పోలీసులు తెలిపారు.
ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గద్వాల-రాయచూర్ రహదారిపై శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల మున్సిపల్ పరిధిలోని దౌధర్‌పల్లికి చెందిన జములమ్మ(45), అర్జున్(22), వైశాలి(18) కలిసి ఆటోలో వ్యాపారం నిమిత్తం రాయచూర్‌కు వెళ్తున్నారు.
ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న బొలెరో గూడ్స్ వాహనం అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బొలెరో గూడ్స్ వాహనం కర్ణాటకకు చెందనదిగా పోలీసులు గుర్తించారు. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతి చెందిన అర్జున్, వైశాలికి మూడు నెలల క్రితమే వివాహం జరిగింది.












Click it and Unblock the Notifications