హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో భారీగా గంజాయిఎక్కడ గంజాయి దొరికినా మూలాలు ఏపీలోనే,స్మగ్లర్లకు పోలీసుల వార్నింగ్

|
Google Oneindia TeluguNews

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి గంజాయి అక్రమ రవాణా యదేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. అక్రమ రవాణాను అడ్డుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు, ఎక్సైజ్ అధికారులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించినప్పటికీ గంజాయి స్మగ్లర్లు తమ దందాను కొనసాగిస్తూనే ఉన్నారు. రైళ్ల ద్వారా గంజాయి ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. మొన్నటికి మొన్న విశాఖ ఏజెన్సీ నుండి వరంగల్ కు రైలు మార్గం ద్వారా గంజాయి అక్రమ రవాణా జరగగా టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారంతో పట్టుకున్నారు.

కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైల్లో 54 కిలోల గంజాయిని పట్టుకున్న రైల్వే పోలీసులు
తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఏపీ నుండి మహారాష్ట్రకు ఒడిశాకు తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు రైల్వే పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో గంజాయి అక్రమ రవాణా కొనసాగుతోంది. తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో గంజాయి పట్టుబడింది. కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైల్లో 54 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించిన రైల్వే పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ గంజాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి ఒడిశా, మహారాష్ట్రలోని ముంబైకి తరలిస్తున్నట్లు రైల్వే పోలీసులు గుర్తించారు.

Heavy ganja seize in Secunderabad railway station; ganja smuggling from AP, Police warning to smugglers !!

గంజాయి దందా చెస్ ఎవారి ఆస్తులను జప్తు చేస్తామన్న సీపీ మహేష్ భగవత్
ఇదిలా ఉంటే తాజాగా మరో కేసులో గంజాయిని తరలిస్తున్న వారిని అరెస్ట్ చేసిన పోలీసులు, గంజాయి అక్రమ దందాకు పాల్పడితే గంజాయి దందా చేసే వారి ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించారు. గంజాయి సాగు, డ్రగ్స్ దందాపై, వినియోగంపై ఉక్కు పాదం మోపాలన్న తెలంగాణ సీఎం కెసిఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఎన్డీపీఎస్ సెక్షన్ 86 E,F ఆధారంగా కఠిన చర్యలు తీసుకోనున్నట్టు రాచకొండ సీపీ మహేష్ భగవత్ హెచ్చరికలు జారీ చేశారు. గంజాయి దందా విచ్చలవిడిగా పెరిగిపోతున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

విశాఖ ఏజెన్సీ నుండితరలిస్తున్న గంజాయిని ఎల్బీ నగర్ లో పట్టుకున్న ఎస్ఓటీ పోలీసులు
శుక్రవారం రోజు ఓ ట్రాన్స్ పోర్ట్ వాహనంలో నూట పది కిలోల గంజాయిని రవాణా చేస్తూ ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులకు పట్టుబడిన ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితుల వివరాలు వెల్లడించిన రాచకొండ సీపీ మహేష్ భగవత్ రాజస్థాన్ కు చెందిన లుంబారామ్ సోలంకి అనే వ్యక్తి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చన్న అత్యాశతో గంజాయి దందాలోకి దిగారని పేర్కొన్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతమైన నర్సీపట్నం నుండి గంజాయిని మహారాష్ట్రకు తరలించే క్రమంలో పోలీసులు పట్టుకున్నారని ఈ కేసు వివరాలను వెల్లడించారు.

గంజాయి స్మగ్లింగ్ చేసే వారిపై పీడీ యాక్ట్ .. కఠిన చర్యలు
అంతే కాదు గంజాయి స్మగ్లింగ్ చేసే వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తరచుగా గంజాయి కేసులలో పట్టుబడుతున్న వారిపై పీడీ యాక్ట్ పెడుతున్నామని ఆయన తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా శిక్ష పడేలా చూస్తున్నామని సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. అంతేకాదు గంజాయి అక్రమ రవాణా కేసులలో పట్టుబడిన వారి ఆస్తులను జప్తు చేస్తామని సి పి మహేష్ భగవత్ పేర్కొన్నారు. గతంలో అబ్దుల్లాపూర్ మెట్ లో రెండు వేల కిలోల కోట్ల విలువ చేసే గంజాయిని సీజ్ చేసిన కేసులో నిందితుల ఆస్తులు జప్తు చేశామని వెల్లడించారు . గంజాయి ఉత్పత్తులను అన్ని సమాజాన్ని నాశనం చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు

English summary
Heavy ganja seized at Secunderabad railway station 54 kg of cannabis was seized on the Konark Express. Wherever marijuana is found, the roots remain in the AP. police warning to Smugglers that their assets will be confiscated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X