Rain: హైదరాబాద్‍లో భారీ వర్షం.. కరెంటు షాక్‍తో కానిస్టేబుల్ మృతి..
హైదరాబాద్ లో ఆదివారం రాత్రి భారీ వర్షం పడింది. యూసఫ్‌గూడ, పంజాగుట్ట, సోమాజీగూడ, ఖైరతాబాద్, లక్డీకాపూల్, తార్నాక, హబ్సిగూడ, నాచారం,గోల్నాక, నల్లకుంట, విద్యానగర్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, మల్లాపూర్, సుచిత్ర, జీడిమెట్ల, సూరారం, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కూకట్‌పల్లి, బోరబండ, మోతీనగర్, ఎర్రగడ్డ, సనత్‌నగర్, అమీర్‌పేట, అంబర్‌పేట, కాచిగూడలో ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో వర్షం పడింది.
ఈదురుగాలులతో పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల రాత్రంతా కరెంట్ లేదు. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. కాగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది. ఈ మేరకు 040 211 11111 ఫోన్ నెంబరుతో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద కరెంట్ షాక్ తో గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ఒకరు మృతి చెందారు.

సోలేం వీరాస్వామి(45) అనే గ్రే హౌండ్స్ లో పనిచేసే కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి 9.40 గంటల సమయంలో యూసుఫ్ గూడా బెటాలియన్ లో పని చేసే తన తమ్ముడిని కలిసి, తిరిగి బైక్ పై వెళ్తున్న క్రమంలో బైక్ మీద వెళ్తుండగా TV5 నుంచి NTR భవన్ వైపు ఫ్రీ లెఫ్ట్ దారిలో వెళ్తుండగా భారీ వర్షం, బలమైన ఈదురు గాలులా కారణంగా అదుపు తప్పి బైక్ తో సహా ఫుట్ పాత్ పై పడ్డాడు. అక్కడ కరెంట్ వైర్ తగలడంతో విద్యుత్ ఘాతంతో మృతి చెందాడు.
డయాల్ 100 ద్వారా సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పెట్రోలింగ్ సిబ్బంది వెళ్లి చూడగా వీరస్వామిలో చలనం లేదు. వెంటనే అంబులెన్సు లో అతన్ని అపోలోకు తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. వీరస్వామి కుటుంబంతో పాటు గండిపేట క్వార్టర్స్ లో ఉంటున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications