• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మూడునెలలుగా హేమంత్-ప్రియాంక సహజీవనం.. వద్దన్నందుకు స్నేహితుడినే ...

|

హైదరాబాద్ : సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సతీశ్ హత్య కేసు మిస్టరీ వీడింది. చిన్ననాటి స్నేహితుడు హేమంతే హత్య చేశాడని విచారణలో తేలింది. ప్రియాంకతో సన్నిహిత్యం, జీతం తగ్గించడంతో హేమంత్ రగిలిపోయాడని .. అందుకే పథకం ప్రకారం సతీశ్‌ను మట్టుబెట్టాడని పోలీసులు తెలిపారు. హత్యకు ముందు పుణెలో ఉన్న తన స్నేహితుడి సలహాను కూడా నిందితుడు తీసుకున్నాడని పేర్కొన్నారు. పథకం ప్రకారమే ఇంటికి పిలిపించి .. మద్యం సేవించాక ... ముందుగా తన వద్ద ఉంచుకొన్న సుత్తితో తలపైబాది హతమార్చాడని వెల్లడించారు.

వారిద్దరు సన్నిహితంగా ఉండటం జీర్ణించుకోలేక .. సతీశ్ మర్డర్‌పై పోలీసులు

హితుడే ..

హితుడే ..

చేయి పట్టుకొని నడిచిన చిన్ననాటి స్నేహితుడే సతీశ్‌ను దారుణంగా హతమార్చాడు. వీరి వద్ద పనిచేస్తున్న ప్రియాంక విషయంలోనే గొడవ జరిగిందని మాదాపూర్ డీసీపీ మీడియాకు తెలిపారు. కేపీహెచ్‌బీలో సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టిట్యూట్‌ను సతీశ్ నెలకొల్పాడు. అయితే 2016లో స్నేహితుడు సతీశ్ వద్దకు హేమంత్ చేరిపోయాడు. ఉద్యోగం కావాలని చెబితే .. ఇన్‌స్టిట్యూట్‌లో నెలకు రూ.20 వేలకు అడ్మినిస్ట్రేటర్‌గా నియమించాడు. ఇంతలో ప్రియాంక కూడా సీన్‌లోకి ఎంటరైంది. ప్రియాంక సతీశ్‌కు అమీర్‌పేట ఇన్‌స్టిట్యూట్‌లో పరిచయం అయ్యింది. అయితే అంతకుముందే హేమంత్ ప్రియాంక ఒకరికొకరు తెలుసు .. తర్వాత కేపీహెచ్‌బీలోని ఆఫీసుకు ప్రియాంకను హేమంత్ ఆహ్వానించాడు. వీరిద్దరూ కలిసి కేపీహెచ్‌బీలో గత మూడు నెలలుగా ఉంటున్నారు. అయితే ఇన్నాళ్లు ఈ విషయం తెలియని సతీశ్.. వీరి వ్యవహారం తెలిసింది. ఇద్దరిని ప్రవర్తన మానుకోవాలని హెచ్చరించాడు.

వద్దని చెబితే

వద్దని చెబితే

హేమంత్, ప్రియాంకకు సతీశ్ వారం రోజుల డెడ్‌లైన్ విధించాడు. దీంతో ప్రియాంక తన మకాన్ని హాస్టల్‌కు మార్చింది. ఆగస్ట్ 28వ రోజు సాయంత్రం ఇన్ స్టిట్యూట్ నుంచి సతీశ్ బయల్దేరాడు. హాస్టల్ వద్ద ప్రియాంకను డ్రాప్ చేశాడు. హేమంత్ ఒక్కడే ఉంటున్నాడా లేదా అని తెలుసుకొనేందుకు ఇంటికి వెళ్లాడు. అయితే మద్యం తీసుకురావాలని హేమంత్ కోరగా .. వెంకటేశ్వర వైన్స్‌లో నాలుగు బీర్లు తీసుకొని వెళ్లాడు సతీశ్. మద్యం సేవించే సమయంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన హేమంత్ .. సుత్తితో సతీశ్ తలపై దాడి చేశాడు. దీంతో అతను సృహ కోల్పోయాడు. తర్వాత అతని డెడ్ బాడీని ముక్కలు ముక్కలు చేశాడు. తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేశాడు. అప్పటికే క్యాబ్ బుక్ చేశాడు. పాలిథిన్ కవర్ కూడా తీసుకొచ్చాడు. కానీ సతీశ్ మృతదేహం బరువు ఉండటంతో తీసుకెళ్లలేక .. అక్కడే ఉంచి ఇంటికి తాళం వేసి పోయాడని తెలిపారు.

హతమార్చి

హతమార్చి

తర్వాత సతీశ్ గురించి స్నేహితులు ఫోన్ చేయగా .. ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేశాడు. 29వ తేదీ రోజు హేమంత్‌పై అనుమానం రావడంతో మెల్లగా జారుకున్నాడని వివరించారు. వీరి మధ్య ప్రియాంకకు సంబంధించి వివాదం ఉంది. తీరు మార్చుకోవాలని చెబితే మట్టుబెట్టాడని పోలీసులు చెప్తున్నారు. సతీశ్ హత్య కేసులో హేమంత్ నిందితుడని .. ఇతరుల ప్రమేయం గురించి తెలియరాలేదని డీసీపీ చెప్పారు. హేమంత్, ప్రియాంకకు సంబంధించి మేసెజ్‌లు డిలేట్ అయ్యాయని ... వాటిని రీట్రైవ్ చేస్తున్నామని తెలిపారు. అన్నీ కోణాలో దర్యాప్తు జరుగుతుందని పోలీసులు తెలిపారు.

English summary
Mystery murder of software engineer Satish revealed police. The investigation showed that Hemante was murdered by a childhood friend. Hemant had broken up with Priyanka and reduced his salary. The accused also took the advice of his friend in Pune before the murder. According to the scheme, after having consumed alcohol, he revealed that he had killed head with a hammer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more