హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఖాళీల వివరాలు: జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లు.. శాఖల డిటైల్స్ ఇదే..

|
Google Oneindia TeluguNews

ఉద్యోగాల భర్తీ ప్రకటనతో రాష్ట్రంలో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. 11 వేల పైచిలుకు కాంట్రాక్ట్ పోస్టులను రెగ్యురల్ చేస్తారు.వీటితో కలిపి కొలువుల మొత్తం సంఖ్య 91,142కి చేరాయి. గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3, గ్రూప్‌-4 పోస్టులతోపాటు జిల్లాలు, జోనల్‌, మల్టీజోనల్‌, సెక్రటేరియట్‌, హెచ్‌ఓడీలు, వర్సిటీల్లోని పోస్టులు ఉన్నాయి. వీటిలో జిల్లాల్లో మొత్తం 39,829 పోస్టులు ఉన్నాయి. క్యాడర్ వారీగా ఖాళీలు వివరాలు ఉన్నాయి. జిల్లాల్లాలో- 39,829 పోస్టులు.. జోన్లలో- 18,866 పోస్టులు.. మల్టీజోనల్‌ పోస్టులు- 13,170, సచివాలయం,హెచ్ఓడీలు, విశ్వవిద్యాయాల్లో- 8,147 కొలువులు ఉన్నాయి.

జిల్లాల వారీగా ఇలా..

జిల్లాల వారీగా ఇలా..


ఇక జిల్లాల వారీగా ఖాళీలను చూస్తే.. హైదరాబాద్ - 5,268,నిజామాబాద్- 1,976, మేడ్చల్ మల్కాజ్‌గిరి- 1,769, రంగారెడ్డి- 1,561, కరీంనగర్- 1,465, నల్లగొండ- 1,398, కామారెడ్డి- 1,340, ఖమ్మం- 1,340, భద్రాద్రి కొత్తగూడెం- 1,316, నాగర్‌కర్నూల్- 1,257, సంగారెడ్డి- 1,243, మహబూబ్‌నగర్- 1,213, ఆదిలాబాద్- 1,193, సిద్దిపేట- 1,178, మహబూబాబాద్- 1,172, హన్మకొండ- 1,157, మెదక్- 1,149, జగిత్యాల- 1,063, మంచిర్యాల- 1,025, యాదాద్రి భువనగిరి- 1,010, జయశంకర్ భూపాలపల్లి- 918, నిర్మల్- 876, వరంగల్- 842, కుమ్రం భీం ఆసీఫాబాద్- 825, పెద్దపల్లి- 800, జనగాం- 760, నారాయణపేట్- 741, వికారాబాద్- 738, సూర్యాపేట- 719, ములుగు- 696, జోగులాంబ గద్వాల- 662, రాజన్న సిరిసిల్ల- 601, వనపర్తి- 556 పోస్టులు ఉన్నాయి.

జోన్లు, మల్టీ జోన్లు..

జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. జోన్‌లలో18,866 ఖాళీలు, మల్టీ జోన్‌లలో 13,170 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. జోన్ల వివరాలు.. కాళేశ్వరం జోన్‌లో- 1,630, బాసర జోన్‌- 2,328, రాజన్న జోన్‌- 2,403, భద్రాద్రి జోన్‌- 2,858, యాదాద్రి జోన్‌- 2,160, చార్మినార్ జోన్‌- 5,297, జోగులాంబ జోన్‌- 2,190 ఉన్నాయి. అలాగే మల్టీజోన్లు వివరాలు.. మల్టీజోన్ 1- 6,800, మల్టీజోన్ 2- 6,370 పోస్టులు ఉన్నాయి.0

అన్నీ శాఖల్లో ఇలా

అన్నీ శాఖల్లో ఇలా

రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 80,039 ఖాళీలు ఉన్నాయని, వాటిని నేరుగా భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. నియామక ప్రక్రియ నేటినుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. శాఖల వారీగా ఖాళీల వివరాలు.. హోం శాఖ- 18,334, సెకండరీ ఎడ్యుకేషన్- 13,086,హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్- 12,755, హైయర్ ఎడ్యుకేషన్- 7,878, బీసీల సంక్షేమం- 4,311, రెవెన్యూ శాఖ- 3,560, ఎస్సీ వెల్ఫేర్‌ శాఖ- 2,879, నీటిపారుదల శాఖ- 2,692, ఎస్టీ వెల్ఫేర్- 2,399, మైనారిటీస్ వెల్ఫేర్- 1,825, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ మరియు టెక్నాలజీ- 1,598, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ- 1,455, లేబర్, ఎంప్లాయీమెంట్- 1,221, ఆర్థిక శాఖ- 1,146, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్- 895, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్- 859, అగ్రికల్చర్, కో-ఆపరేషన్- 801, రవాణా, రోడ్లు, భవనాల శాఖ- 563, న్యాయశాఖ- 386, పశుపోషణ, మత్స్య విభాగం- 353, జనరల్ అడ్మినిస్ట్రేషన్- 343, ఇండస్ట్రీస్, కామర్స్- 233, యూత్, టూరిజం, కల్చర్- 184, ప్లానింగ్- 136, ఫుడ్, సివిల్ సప్లయిస్- 106, లెజిస్లేచర్- 25, ఎనర్జీ- 16 పోస్టులు ఉన్నాయి.

English summary
here is jobs vacany list from district and zone, multy zone wise.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X