చిరంజీవి-మోహన్ బాబు ఫ్రెండ్స్.. పవన్ : పరీక్ష రాసాను-రిలాక్స్ గా ఉన్నా ..విష్ణు : మా పోలింగ్ హైలైట్స్..!!

"మా " పోలింగ్ సందడి ప్రారంభమైంది. ఊహించని విధంగా పోలింగ్ ప్రారంభ సమయానికే ప్రముఖ నటులు పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. మోహన్ బాబు పోలింగ్ కేంద్రం వద్ద ప్రధాన పోటీ దారులుగా ఉన్న విష్ణు - ప్రకాశ్ రాజ్ తో చేతులు కలిపించారు. వారిద్దరూ ఆలింగనం చేసుకోవటం పోలింగ్ ముందు ఆసక్తి కరంగా మారింది. రెండు ప్యానళ్లకు చెందిన సభ్యులు పోలింగ్ కేంద్రం వద్ద సందడి చేసారు. నరేశ్ తో పాటుగా రాజీవ్ కనకాల..ఉత్తేజ్..శ్రీకాంత్..పోసాని..శివ బాలాజీతో పాటుగా పలువురు పోలింగ్ కేంద్రం వద్ద మంతనాల్లో మునిగిపోయారు.

పోలింగ్ కేంద్రంలో సందడిగా...

పోలింగ్ కేంద్రంలో సందడిగా...

ఇక, తన తండ్రితో పోలింగ్ కేంద్రం వద్దకు విష్ణు చేరుకున్నారు. అక్కడ మోహన్ బాబు రాగానే సినీ నటులు అంతా ఆయన వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో మోహన్ బాబుకు పాదాభివందనం చేసేందుకు ప్రయత్నించిన ప్రకాశ్ రాజ్ ను మోహన్ బాబు భుజం తట్టారు. ఇక, విష్ణు తన సతీమణితో కలిసి రిలాక్స్ గా కనిపించారు. తాను పరీక్ష రాసానని..పేపర్లు దిద్దుతున్నారని వ్యాఖ్యానించారు. తాను చాలా రిలాక్స్ గా ఉన్నానంటూ పరోక్షంగా విజయం పైన ధీమా వ్యక్తం చేసారు. ఇదే సమయంలో ఇతర నటుల్లో మాత్రం ఇంకా నిన్నటి వరకు కొనసాగిన డైలాగ్ వార్ ప్రభావం కనిపించింది.

పవన్ - రాం చరణ్ తొలి అరగంటలోనే

పవన్ - రాం చరణ్ తొలి అరగంటలోనే

ఇక, తన ఓటు హక్కు వినియోగించుకనేందుకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. తిప్పి కొడితే 900 ఓట్లు కూడా లేని చోట ఇన్ని మాటలు ..విమర్శలు అవసరమా అని ప్రశ్నించారు. అన్నం పెట్టే పరిశ్రమను కించపర్చవద్దని పవన్ కోరారు. మా ఎన్నికల్లో గతంలో ఎన్నడూ ఇంత పోటీ చూడలేదన్నారు. పంతాలు..పట్టింపులకు పోవటం వలనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ప్రకాశ్ రాజ్ కు బీజేపీ అంటే ఇష్టం ఉండదని..కానీ, నలులుగా కలిసే ఉంటామన్నారు. ఇందులో వ్యక్తిగత దూషణలు అవసరమా అని ప్రశ్నించారు.

మోహన్ బాబు - చిరంజీవి ఫ్రెండ్స్ అంటూ

మోహన్ బాబు - చిరంజీవి ఫ్రెండ్స్ అంటూ

సినిమా చేసే వాళ్లు ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో కొన్ని సందర్బాల్లో ప్రతిపక్షాలతో పోలింగ్ సమయంలో కలుస్తారని..ఇక్కడ ఎందుకు ఈ పరిస్థితి అని వ్యాఖ్యానించారు. చిరంజీవి..మోహన్ బాబు ఇద్దరూ ఫ్రెండ్స్ అంటూ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఓట్ల కోసం డబ్బుల పంపకం గురించి తనకు తెలియదని సమాధానం ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీ చీలటం అనే ప్రశ్నే లేదన్నారు. పవన్ తొలి అరగటంలోనే తన ఓటు హక్కు వినియోగించు కున్నారు. మెగా హీరో రాం చరణ్ సైతం పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు.

మంచు ఫ్యామిలీ ధీమాగా..

మంచు ఫ్యామిలీ ధీమాగా..

ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్కడే ఉన్న విష్ణును ఆలింగనం చేసకున్నారు. మోహన్ బాబును పలకరించారు. వారిద్దరితో కొద్ది సేపు ముచ్చటించారు. మంచు విష్ణు సోదరి లక్ష్మీ ..సోదరుడు మనోజ్ సైతం ఓటు వేసారు. లక్ష్మీ తన సోదరుడి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. కొట్టుకుంటునే దగ్గర అవుతారని..చాలా హెల్తీగా పోటీ జరుగుతోందని లక్ష్మీ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ పై దూషణలతో చెలరేగిన నటుడు పోసాని సైతం తన ఓటు హక్కు వినియోగంచుకున్నారు.

సాయంత్రం ఫలితాలు

సాయంత్రం ఫలితాలు

ఇక, ఈ సారి గతం కంటే పోలింగ్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాత్రికి తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. పోలింగ్ ముందు రోజు రాత్రి వరకు కనిపించిన సన్నివేశాలకు భిన్నంగా పోలింగ్ నాడు అందరూ కలిసి సండదిగా కనిపిస్తున్నారు. మోహన్ బాబు తన కుమారుడి ప్యానెల్ బ్రోచర్ చూపిస్తూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+