ప్రేమ వల: 18 ఏళ్ల లోపు యువత టార్గెట్.. బాధితులంతా కలిసి... చివరకు ఇలా..
ప్రేమపేరుతో యువకులను ట్రాప్ చేసి.. మోసం చేస్తున్న కిలాడీ లేడి బండారం బయటపడింది. కేరళ నుంచి హైదరాబాద్ వచ్చిన వివాహిత.. 18 ఏళ్లలోపు యువకులు టార్గెట్ గా చేసుకుంది. ప్రేమపేరుతో మోసం చేస్తూ.. కాలం వెళ్లదీస్తోంది. ఆమె చేతిలో మోసపోయిన వారు హ్యూమన్ రైట్స్ కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై హెచ్ఆర్సీ స్పందించింది.
నవంబర్ 10లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని రాచకొండ సీపీని హెచ్ఆర్సీ ఆదేశించింది. కిలాడీ లేడి 18 ఏళ్ల యువకులను టార్గెట్ చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. ప్రేమ పేరుతో బుట్టలో వేసుకొని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాట్సాప్‌లో సందేశాలు పంపేదని చెప్పారు. ఆ తర్వాత బెదిరింపులకు దిగుతుందని బాధితులు వాపోయారు. చాటింగ్ పోలీసులకు చూపించి ఫిర్యాదు చేస్తానని బెదిరింపులకు దిగుతుందని తెలిపారు.

అమాయకుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజుతున్నట్లు బాధితులు పేర్కొన్నారు. నగరంలో పదిమందికే పైగా కిలాడీ లేడి చేతిలో మోసపోయారని బాధితుడి తండ్రి మీడియాకు వివరించాడు. అనేక మందిపై సదరు మహిళ కేసులు కూడా పెట్టిందని వాపోయారు. పిల్లలను జాగ్రత్తగా పెంచాలని.. ఇటువంటి కిలాడీ లేడిల చేతిలో పడి ఆత్మహత్యలు కూడా చేసుకునే అవకాశం ఉందని.. పిల్లలు ఎం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని బాధితుడి తండ్రి ఒకరు తెలిపారు.
Recommended Video
హైదరాబాద్‌లో గతంలో కూడా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి పేరుతో ఓ యువతి సుమారు 50 లక్షలు దోచుకుంది. ఒకరిద్దరిని కాదు పదుల సంఖ్యలో మోసం చేసింది. చివరకు ఆ యువతి పోలీసులకు చిక్కించి. ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది. మోసం చేసేవారు ఉంటారు.. మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలని మరోసారి రుజువు అయ్యింది.












Click it and Unblock the Notifications