హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హరన్ కొట్టి చూడు.. ట్రాఫిక్ సమస్యకు కేటీఆర్ కత్తిలాండి ఐడియా.. డీజీపీకి ట్వీట్

|
Google Oneindia TeluguNews

మెట్రో సిటీలో.. చౌరస్తా వద్ద రెడ్ సిగ్నల్ పడటంతో వందల మీటర్ల దూరంలో వాహనాలు నిలిచిపోతాయి. ఓపికలేని వాహనదారులు హరన్ కొట్టడంతో సౌండ్ పొల్యూషన్ సంగతి ఇక చెప్కక్కర్లేదు. కానీ ఆ సమస్యకు ముంబై పోలీసులు విరుగుడు కనుగ్గొన్నారు. సిగ్నల్ పడిన సమయంలో వాహన యాజమానులు పొరపాటున కూడా హరన్ కొట్టారో ఇక అంతే సంగతులు.

మీటర్ కౌంట్..

మీటర్ కౌంట్..

అవును మీరు మరచిపోయి హరన్ కొట్టినా.. సిగ్నల్ వద్ద ఏర్పాటు చేసిన డిజేబుల్ మీటర్ (డీఎం) పాయింట్లు రికార్డవుతోంది. ఒకవేళ మీటర్‌ 85 దాటిందో ఇక అంతే సంగతి. మళ్లీ మీరు 90 సెకన్లు నిరీక్షించాల్సిందే. 85 డిగ్రీలు దాటితే చాలు రెడ్ సిగ్నల్ ఆటోమొటిగ్‌గా మళ్లీ మొదలవుతోంది. ముంబై పోలీసులు ఏర్పాటుచేసిన ఈ కొత్త విధానం వాహనదారులకు ఇట్టే అర్థం కాలేదు.

85 దాటిందో అంతే..

85 దాటిందో అంతే..


ముంబై.. మహానగరం ఇక్కడి రోడ్లపై రద్దీ ఎక్కువే. ఇక ఉదయం సాయంత్రం సంగతి అసలె చెప్పక్కర్లేదు. దీంతో ఆయాచోట్ల డ్యూటీ చేస్తోన్న ట్రాఫిక్ పోలీసు, పరిసరాల్లో ఉన్న జనం చెవులు పోతున్నాయి. ముంబైకర్లు హరన్ కొట్టకుండా చేయడం ఎలా అని ఆలోచించారు. వెంటనే కత్తి లాండి ఐడియా తట్టడంతో డీజెబుల్ మీటర్ ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లలో నెలకొల్పగా మరునాడు వాహనదారులు ఎప్పటిలానే హరన్ కొడుతున్నారు. ఇంకేముంది 85 డిగ్రీలు దాటిన తర్వాత మళ్లీ సిగ్నల్ పడటంతో అర్థం కాలేదు. కానీ పక్కనే గల స్క్రీన్‌పై మాత్రం honk more wait more అని రాసి ఉంది. దీంతో వారికి తత్వం బోధపడింది.

హైదరాబాద్‌లో కూడా..?

హైదరాబాద్‌లో కూడా..?

హరన్ కొడితే ఉపయోగం లేదు.. మరో 90 నిమిషాలు ఇక్కడే ఉండాలి అని అర్థం చేసుకున్నారు. తర్వాత తాము చేసిన ప్రయోగాన్ని ముంబై పోలీసులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 1.54 నిడివిగల వీడియోను తెలంగాణ మంత్రి కేటీఆర్ చూసి ఆశ్చర్యపోయారు. ముంబై పోలీసుల ప్రయోగాత్మక విధానాన్ని ప్రశంసించారు. ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇలా హైదరాబాద్‌లో ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. ఈ ప్రయోగాన్ని ఆలోచించాలని తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ పోలీసు కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు మంత్రి కేటీఆర్ సూచించారు. వీడియోలో చివరగా feel free to honk..if you dont mind waiting అని కూడా ముంబై పోలీసులు సందేశం ఇచ్చారు.

అత్యద్భుతం..

మంత్రి కేటీఆర్ పోస్ట్ చేసిన వీడియోకు నెటిజన్లు స్పందిస్తున్నారు. అద్భుంగా ఉందని కొందరు అంటుంటే.. యువతను రాజకీయాల్లోకి తీసుకోవాలని మరికొందరు సలహాలిస్తున్నారు. ‘టామ్ టామ్' అనే వాహనాల నావిగేషన్ సంస్థ ఆన్యువల్ ట్రాఫిక్ ఇండెక్స్‌ను ఇటీవల ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత ట్రాఫిక్ ఉండే నగరాల్లో ముంబై నాలుగోస్థానంలో ఉంది. దేశ ఆర్థిక రాజధాని ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకొంటే.. ఆ మేరకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇక మన హైదరాబాద్‌లో ఎప్పుడూ అమలుచేస్తారో చూడాలి మరి.

English summary
minister ktr share a vedio to dgp about mumbai police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X