హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దసరా ఎఫెక్ట్... చౌటుప్పల్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్... 4కి.మీ మేర నిలిచిపోయిన వాహనాలు...

|
Google Oneindia TeluguNews

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.బతుకమ్మ,దసరా పండుగల నేపథ్యంలో చాలామంది హైదరాబాద్ నుంచి గ్రామాల బాట పట్టారు.దీంతో చౌటుప్పల్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి 4కి.మీ మేర వాహనాలు రోడ్డు పైనే నిలిచిపోయాయి.చౌటుప్పల్ నుంచి కొయ్యలగూడెం వరకు వాహనాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇక శుక్రవారం(అక్టోబర్ 15) దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణకు దసరా ఒక ప్రత్యేకమైన వేడుక అని పేర్కొన్నారు. లక్ష్య సాధనలో విశ్రమించకూడదనేది దసరా ఇచ్చే స్ఫూర్తి అన్నారు. చెడుపై మంచి విజయానికి సంకేతమే విజయదశమి అని వివరించారు. ఈ దసరా సందర్భంగా అందరికీ ఆరోగ్యం, సిరిసంపదలు కలగాలని ఆయన ప్రార్థించారు.

huge traffic rush at choutuppal due to dasara and bathukamma festivals affect

తెలంగాణలో బతుకమ్మ,దసరా పండుగలను అత్యంత పెద్ద ఎత్తున నిర్వహిస్తారనే విషయం తెలిసిందే.ప్రకృతి పూలను ఆరాధించే అరుదైన,విశిష్ఠమైన పండుగ బతుకమ్మ.ఎంగిలిపూల బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ,వెన్న ముద్దల బతుకమ్మ,సద్దుల బతుకమ్మ.. ఇలా 9 రోజుల పాటు బతుకమ్మ వేడుకలు జరుగుతాయి.

చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు సాయంత్రం బతుకమ్మని పేర్చి ఆటపాటలతో వేడుక జరుపుకుంటారు. అనంతరం బతుకమ్మని తలపై పెట్టుకుని ఊరేగింపుగా చెరువు వద్దకు వెళ్తారు. అక్కడ బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత సత్తు ముద్దల ప్రసాదాన్ని బంధుమిత్రులకు పంచిపెడుతారు.

Recommended Video

Telangana లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీ విత్తన తయారీ దారులు!!

సాధారణంగా రాష్ట్రమంతా ఒకేరోజు సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగుతాయి.కానీ ఈసారి భిన్నమైన పరిస్థితి నెలకొంది. తెలంగాణ విద్వత్సభ, జ్యోతిష్య పండితులు, పూజారులు వేర్వేరు తేదీలు ప్రకటించడంతో కొన్నిచోట్ల బుధవారం,మరికొన్నిచోట్ల గురువారం ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. దుర్గాష్టమి నాడే సద్దుల బతుకమ్మగా పండితులు నిర్ణయించగా, కొండపాక, వేములవాడల్లో ఏడు రోజులు నిర్వహిస్తారని, కొన్ని ప్రాంతాల్లో 9, మరికొన్ని ప్రాంతాల్లో 11, 13 రోజులు ఆడతారని తెలంగాణ విద్వత్సభ అధ్యక్షుడు చంద్రశేఖర సిద్ధాంతి పేర్కొన్నారు.అయితే తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడే సాంప్రదాయాన్ని కొనసాగించాలనుకునేవారు గురువారం సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకోనున్నారు.

English summary
A huge traffic jam has occurred at Ch0utupal in Yadadri Bhongir district. Many people have left Hyderabad for villages on the wake of Batukamma and Dussehra festivals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X