హుజురాబాద్‌లో గెలుస్తాం: కేటీఆర్‌కు గిప్ట్ ఇస్తాం: పాడి కౌశిక్ రెడ్డి
హుజురాబాద్‌లో ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జెండా ఎగురవేసి మంత్రి కేటీఆర్‌కు బర్త్‌డే గిఫ్ట్‌గా ఇస్తామని టీఆర్‌ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ముషీరాబాద్‌లో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు టి.సోమన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముక్కోటి వృక్షోత్సవానికి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కామెంట్స్ చేశారు. హుజురాబాద్ నుంచి టీఆర్ఎస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ క్రమంలో కౌశిక్ కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకుంది.
టీఆర్ఎస్ నుంచి రేసులో కౌశిక్ రెడ్డి ఉన్నారు. ప్రవీణ్ కుమార్ పేరు వినిపించినా.. ఆయన ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. మిగతా నేతల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. కానీ మారిన పరిణామాల నేపథ్యంలో.. కౌశిక్‌కే టికెట్ వస్తోందా అనిపిస్తోంది. ఇటు ఇటీవల మోత్కుపల్లి నర్సింహులు కూడా బీజేపీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్‌లో చేరతానని ప్రకటించారు కూడా. దీంతో టికెట్ విషయంలో చివరి వరకు ఏమైనా జరగొచ్చు

Recommended Video
కానీ కౌశిక్ రెడ్డి మాత్రం హుజురాబాద్‌లో బలమైన నేత.. ఇదివరకు గట్టి మెజార్టీ వచ్చింది. ఈటల రాజేందర్ గెలిచేందుకు కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు కౌశిక్ లేదంటే దళిత నేత అని టీఆర్ఎస్ హై కమాండ్ ఆలోచిస్తోంది.