పాస్‌పోర్టు సేవలు ఇప్పుడు పోస్టాఫీసుల్లోనూ: పెరిగిన రద్దీ దృష్ట్యా కీలక నిర్ణయం
హైదరాబాద్: ఉన్నత విద్య, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళుతున్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాస్‌పోర్టుల దరఖాస్తులు కూడా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాస్‌పోర్ట్‌కు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు వివరాలను హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య వెల్లడించారు.
హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలోని 14 తపాలా కార్యాలయా(Post office)ల్లో పాస్‌పోర్ట్ సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. మే 20 నుంచే ఆ తపాలా కార్యాలయాల్లో.. పాస్‌పోర్ట్ సేవలు అందుబాటులోకి వచ్చాయని స్పష్టం చేశారు. విద్యార్థులు, ఉద్యోగార్థుల నుంచి వస్తున్న అధిక పాస్‌పోర్ట్ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయానికి వచ్చామని తెలిపారు.

తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు.. తపాలా కార్యాలయాల్లో పాస్‌పోర్టు సేవలను అందిస్తాయని సదరు అధికారి తెలిపారు. ఇందుకు ప్రతి బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి 4.30 గంటల మధ్యలో 700 సాధారణ అపాయింట్‌మెంట్లు ఇస్తామని పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య పేర్కొన్నారు. ప్రతిరోజు అపాయింట్‌మెంట్లలో 10 నుంచి 15 శాతం కొన్ని కారణాలతో తిరస్కరణకు గువుతున్నాయని తెలిపారు. ఇలాంటి విషయాలు ఇతర దరఖాస్తుదారునికి ఇబ్బందిగా మారుతోందని పేర్కొన్నారు. అందుకే అపాయింట్‌మెంట్ సమయంలో అవసరమైన పత్రాలు సమర్పించాలని సూచించారు.

ఎక్కువ సమయం తీసుకోకుండా అపాయింట్‌మెంట్ల కోసం దరఖాస్తుదారులు వేచి చూడకుండా త్వరితగిన సేవలు అందిస్తామన్నారు. ఇప్పటి వరకు ఉద్యోగ, విద్య, మెడికల్ అవసరాలకు సంబంధించిన పత్రాలు కలిగిన దరఖాస్తులనే పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. కాగా, పాస్‌పోర్ట్ దరఖాస్తుల రద్దీని అధిగమించేందుకు రోజు వారీ అపాయింట్మెంట్లకు అదనంగా మరో 500 అపాయింట్‌మెంట్లు ఇవ్వడం ద్వారా.. డిమాండ్‌ను తగ్గించే చర్యలు తీసుకుంటున్నారు. మే 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మరో 7150 అపాయింట్మెంట్లను అదనంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇవే కాకుండా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సూచన మేరకు హైదరాబాద్ పాస్‌పోర్టు ప్రాంతీయ కార్యాలయానికి సమీపంలో ఉన్న 14 తపాలా కార్యాలయాలలో అపాయింట్మెంట్లను తీసుకునే అవకాశం కల్పించారు.












Click it and Unblock the Notifications