Hyderabad: బండ్లగూడ సీఐ, ఎస్సై, కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు..
హైదరాబాద్ సీపీ కొత్త శ్రీనివాస్ రెడ్డి అవినీతికి పాల్పడిన, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా బండ్ల గూడ సీఐ మొహమ్మద్ షాకిర్ అలీ,ఎస్ఐ వెంకటేశ్వర్, కానిస్టేబుల్ రమేష్ లను సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. ఓ మహిళా సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఫిర్యాదు విషయం లో ముగ్గురు అలసత్వం వహించారు. కేసు దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సదరు మహిళా కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.
దీంతో విచారణ చేపట్టిన అధికారులు సీసీ, ఎస్సై నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించారు. దీంతో సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం ఓ స్థిరాస్థి వ్యాపారి కేసులో గోపాలపురం సీఐ మురళీధర్, ఎస్ఐ దీక్షిత్ రెడ్డిపై సీపీ సస్పెన్షన్ వేటు వేశారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ కూడా సస్పెండ్ అయ్యారు. జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు ఓ మహిళా ఫిర్యాదు చేయడానికి వచ్చింది.

భర్త వేధింపులకు గురి చేస్తున్నట్లు కంప్లెయింట్ చేసింది. ఏఎస్ఐ వి. రామయ్య సదరు మహిళా బాధితురాలితో పరిచయం పెంచుకున్నాడు. ఆమె ఫోన్ నంబర్ తీసుకుని తరుచూ ఫోన్ చేసేవాడు. ఆ మహిళతో రామయ్య వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. రామయ్య బందోబస్తూ విధులు నిర్వహించే ప్రదేశానికి ఆమెను పిలిపించుకొని పరిసర ప్రాంతాల్ల ఏకాంతంగా గడిపేవాడు. ఈ విషయం బయటకి వచ్చింది. సోషల్ మీడియాలో దీనిపై విస్తృత ప్రచారం జరిగింది. దీంతో పోలీసులు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.
రామయ్యపై చర్యలు తీసుకున్నారు. అతన్ని సస్పెండ్ చేశారు. కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళపై అనుచితంగా ప్రవర్తించిన మియాపూర్ సీఐని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి సస్పెండ్ చేశారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా సీఐ దురుసుగా ప్రవర్తించాడని మహిళ సీపీకి ఫిర్యాదు చేయడంతో సీపీ అవినాష్ మహంతి విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications