హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో ప్లాట్లు కొంటున్నారా.. జర భద్రం.. అక్రమ లే అవుట్లతో పరేషాన్..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : హైదరాబాద్‌లో ప్లాట్లు కొనాలని అనుకుంటున్నారా?.. స్థలం మీద పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని భావిస్తున్నారా?.. మీ ఆలోచన సరయిందే కావొచ్చు. కానీ భూములు కొనే ముందు మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. లేదంటే లాభాలేమో గానీ అసలుకే ఎసరొచ్చేలా ఉంది పరిస్థితి.

హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పరిధిలో రియల్టర్లు రెచ్చిపోతున్నారు. అక్రమ లే అవుట్లు వేస్తూ జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. తెలిసో తెలియకో వాటిలో ప్లాట్లు కొంటున్న జనాలు ఆ తర్వాత తిప్పలు పడుతున్నారు. వందల సంఖ్యలో అక్రమ లే అవుట్ల బాగోతం వెలుగుచూస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

 నిబంధనలకు తూట్లు.. యదేచ్ఛగా లే అవుట్లు

నిబంధనలకు తూట్లు.. యదేచ్ఛగా లే అవుట్లు

ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ రియల్టర్లు అడ్డదారుల్లో ఊరేగుతున్నారు. లే అవుట్లకు పర్మిషన్ లేకుండా అడ్డగోలుగా ప్లాట్లను విక్రయిస్తూ కోట్లు కూడబెడుతున్నారు. నిర్మాణ రంగంపై ప్రభుత్వం చూపిస్తున్న సానుకూల ధోరణిని అనువుగా మలచుకుని ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. వ్యవసాయ భూములను వెంచర్లుగా చేస్తూ.. గవర్నమెంట్ అనుమతులు లేకుండా జనాలను బురిడీ కొట్టిస్తున్నారు.

ఎకరాల కొద్దీ భూమిని ప్లాట్లుగా మార్చి లే అవుట్ చేయాలంటే ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి. కానీ, క్షేత్రస్థాయిలో అలా జరగడం లేదు. నిబంధనలను బేఖాతరు చేస్తూ అడ్డగోలుగా లే అవుట్లు చేస్తున్నారు రియల్టర్లు. తెలివిగా ప్లాట్లను అమ్ముకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారు.

నల్గొండలో మరో రాక్షసుడు.. 14 ఏళ్ల బాలికకు గర్భం.. శీలానికి వెల కట్టిన పెద్దమనుషులు..!నల్గొండలో మరో రాక్షసుడు.. 14 ఏళ్ల బాలికకు గర్భం.. శీలానికి వెల కట్టిన పెద్దమనుషులు..!

స్పెషల్ డ్రైవ్ లో విస్తుపోయే నిజాలు..!

స్పెషల్ డ్రైవ్ లో విస్తుపోయే నిజాలు..!

అక్రమ లే అవుట్లలో ప్లాట్లు కొంటూ మోసపోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. రియల్టర్లు అందినకాడికి దండుకుని చేతులెత్తేస్తుండటంతో బాధితులు హెచ్ఎండీఏ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ లే అవుట్లు చేస్తున్న స్థిరాస్తి సంస్థల ఆట కట్టించేందుకు హెచ్ఎండీఏ అధికారులు రంగంలోకి దిగారు.

తాజాగా హెచ్ఎండీఏ పరిధిలో అక్రమ లే అవుట్లు, అనధికారిక నిర్మాణాలను గుర్తించడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆ క్రమంలో ఘట్‌కేసర్‌లో 245 , శంకర్‌పల్లి జోన్‌లో 189, మేడ్చల్ 150, శంషాబాద్ 129 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. హెచ్ఎండీఏ పర్మిషన్ లేకుండా మొత్తం 713 అక్రమ కట్టడాలను గుర్తించి నోటీసులు జారీ చేశారు. సంబంధిత నిర్మాణదారులు వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలి. లేదంటే గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి హెచ్‌ఎండీఏ అధికారులు వాటిని కూల్చివేయనున్నారు.

ప్లాట్లు కొన్నోళ్లకు ఇబ్బందులే..!

ప్లాట్లు కొన్నోళ్లకు ఇబ్బందులే..!

ఇక అక్రమ లే అవుట్లలో ప్లాట్లు కొన్నవారికి ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పటికే అక్రమ లే అవుట్లను గుర్తించిన అధికారులు.. అందులోని ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకుండా ఆ శాఖకు హెచ్ఎండీఏ కమిషనర్ లేఖ రాశారు. ఇక అక్రమ నిర్మాణాలకు సంబంధించి పకడ్బందీ చర్యలు తీసుకోనున్నారు. నిర్మాణదారులకు ఇప్పటికే నోటీసులు పంపించిన అధికారులు.. వారి వివరణ కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు ఇచ్చిన గడువు ముగిశాక.. కూల్చివేతలకు సిద్ధం కానున్నారు.

అదలావుంటే జోన్ల వారీగా టౌన్ ప్లానింగ్ అధికారులకు కూడా తిప్పలు తప్పేలా లేవు. వారి పరిధిలో అక్రమ నిర్మాణాలు జరిగినట్లు ప్రూవ్ అయితే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు.

English summary
Illegal Layouts and Constructions found in hundreds at Hyderabad's HMDA area. Officials are going to take neccessary actions. Public may aware about the illegal lay outs, otherwise they loose money for fraud realtors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X