CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మేయర్ విజయలక్ష్మి..
హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి శనివారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. గత ఐదు నెలలుగా పెండింగ్ లో ఉన్న స్టాండింగ్ కమిటీల ఏర్పాటు సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే జనరల్ బాడీ మీటింగ్ పై మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి దీనిపై జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తో ఫోన్ లో చర్చించారు. ముఖ్యమంత్రిని కలవడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు.
మేయర్ విజయలక్ష్మి ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్నారు. కొద్ది రోజులు క్రితం బీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వీరిలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మి రెడ్డి ఉన్నారు. దీంతో వీరంతా కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే వాటిని ఈ ఎమ్మెల్యేలు ఖండించారు.

ఆ తర్వాత రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తను మార్యదపూర్వకంగానే ముఖ్యమంత్రిని కలిసినట్లు ఆయన చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం కలుస్తుండడంతో చర్చలకు దారి తీస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం వక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎవరైనా సరే ముఖ్యమంత్రిని కలవాలంటే చెప్పి వెళ్లాలని స్పష్టం చేశారు. సీఎం, మంత్రులు ప్రజల్లో ఉన్నప్పుడే కలవాలని తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్ ఇలా చెప్పిన కూడా మేయర్ విజయలక్ష్మి సీఎంను కలవడం గమనార్హం.












Click it and Unblock the Notifications