వావ్.. ఓకేరోజు 4 లక్షల మంది ప్రయాణం..హైదరాబాద్ మెట్రో రికార్డు
హైదరాబాద్ మెట్రో కొన్ని వేల మందిని గమ్య స్థానాలను చేరుస్తోంది. అదీ కాస్త లక్షలకు చేరింది. అవును మీరు చదివేది నిజమే. నిన్న సిటీలో మెట్రో అర్ధరాత్రి 2 గంటల వరకు సర్వీసు చేసింది. నిమజ్జనం సందర్బంగా మిడ్ నైట్ వరకు సర్వీస్ చేశారు. జనం కూడా ఆ మేరకు సేవలను వాడుకున్నారు. భారీగా జనం ట్రావెల్ చేయడంతో మెట్రోకు భారీగా ఆదాయం సమకూరింది.
హైదరాబాద్ మెట్రో రైల్ శుక్రవారం కొత్త రికార్డును నెలకొల్పింది. గణేశ్ శోభాయాత్ర సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు హుస్సేన్ సాగర్‌కు వచ్చారు. భక్తుల కోసం శుక్రవారం అర్థరాత్రి దాకా మెట్రో సేవలు నడిచిన సంగతి తెలిసిందే. దీంతో ఒకే రోజు అత్యధిక సంఖ్యలో జనం ప్రయాణించిన విషయంలో హైదరాబాద్ మెట్రో రికార్డులను నమోదు చేసింది.

శుక్రవారం ఒక్కరోజే హైదరాబాద్ మెట్రోలో ఏకంగా 4 లక్షల మంది ప్రయాణించారని అధికారులు వివరంచారు. మియాపూర్- ఎల్బీ నగర్ కారిడార్‌లో 2.46 లక్షల మంది ప్రయాణించారు. నాగోల్- రాయదుర్గం కారిడార్‌లో 1.49 లక్షల మంది ప్రయాణించారు. జేబీఎస్- ఎంజీబీఎస్ కారిడార్‌లో 22 వేల మంది ట్రావెల్ చేశారు.
ఆయా స్టేషన్లలో అత్యధికంగా 22 వేల మంది ఖైరతాబాద్ స్టేషన్‌లో రైలు ఎక్కారు. 44 వేల మంది ఆ స్టేషన్‌లోనే రైలు దిగారు. వేగంగా గమ్య స్థానాలకు ప్రజలను మెట్రో చేరుస్తోంది. మెట్రో అందుబాటులోకి వచ్చిన తర్వాత.. జనం సిటీ బస్సులు, ఇతర టాక్సీ వాడటం తక్కువ అయ్యింది. ముఖ్యంగా ఐటీ ఫీల్డ్ వారు మెట్రోనే యూజ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications