నిమ్స్ డాక్టర్స్ రికార్డ్: 24 గంటల్లో నాలుగు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్స్
హైదరాబాద్: నగరంలోని నిమ్స్ ఆస్పత్రి వైద్యులు సరికొత్త రికార్డు సృష్టించారు. కేవలం 24 గంటల్లోనే నాలుగు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్లు విజయవంతంగా నిర్వహించి ఈ ఘనత సొంతం చేసుకున్నారు.
రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఖర్చయ్యే ఈ కిడ్నీ మార్పిడి చికిత్సను ఆరోగ్యశ్రీ పథకం కింద పేద రోగులకు ఉచితంగా నిర్వహించారు.
గత నాలుగు సంవత్సరాలుగా డయాలసిస్ చికిత్స పొందుతున్న బాధితులకు. బ్రెయిన్ డెడ్ అయిన ముగ్గురు రోగుల నుంచి కిడ్నీలను మార్పిడి చేశారు.

ఒకరేమో బతికుండగానే ఓ కిడ్నీని దానం చేసి మానవత్వాన్ని చాటుకోవడం గమనార్హం. ఈ నాలుగు కిడ్నీలను ఒకే రోజులో విజయవంతంగా మార్పిడి చశారు నిమ్స్ వైద్యులు. కిడ్నీలను అమర్చిన తర్వాత ఆ వ్యక్తులు అంతా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.
నిమ్స్ యూరాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ రాంరెడ్డి, ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ ఆధ్వర్యంలో డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ రామచంద్రయ్య, డాక్టర్ రఘువీర్, డాక్టర్ చరణ్ కుమార్, డాక్టర్ ధీరజ్, డాక్టర్ వినయ్, డాక్టర్ సునీల్, డాక్టర్ అరుణ్, డాక్టర్ జానకి, డాక్టర్ విష్ణు, డాక్టర్ పవన్, డాక్టర్ హర్ష, డాక్టర్ సూరజ్, డాక్టర్ పూవరసన్, డాక్టర్ అనంత్, డాక్టర్ షారూక్, అనస్థషీయా డాక్టర్లు డాక్టర్ పద్మజా, డాక్టర్ నిర్మల, డాక్టర్ ఇందిరా, డాక్టర్ గీత ఈ కిడ్నీ మార్పిడి ఆపరేషన్లలో భాగస్వాములయ్యారు.












Click it and Unblock the Notifications