• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోదీ సాబ్.. మా బాకీ ఇప్పించండి -ఇబ్బందుల్లో ఉన్నాం -కేంద్రానికి హైదరాబాద్ నిజాం మ‌న‌వ‌డి విజ్ఞప్తి

|
Google Oneindia TeluguNews

చివరి రోజుల్లో నిరంకుశ పాలకుడిగా మచ్చ, పాకిస్తాన్‌లో కలిసిపోతానని పేచీ తప్ప.. హైదరాబాద్ సంస్థానాన్ని అన్ని రకాలుగా ఉన్నత స్థానంలో నిలబెట్టిన ఘనత నిజాం పాలకులదేనని తెలంగాణ ఉద్యమకారులు, చరిత్రకారులు చెబుతుంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే మరో అడుగు ముందుకేసి.. నాడు విద్యాలయాలు, వైద్యశాలల నిర్మాణంలో నిజాం లాంటి రాజు దేశంలోనే లేడని కితాబివ్వడం తెలిసిందే. భారత యూనియన్ లోకి హైదరాబాద్ సంస్థానం కలిసిపోయిన తర్వాత నిజాం తన ఆస్తులతోపాటే విదేశాలకు చెక్కేశాడు. కానీ..

ఢిల్లీ సరిహద్దుల్లోనే ట్రాక్టర్ ర్యాలీ -ఎర్రకోట వద్ద కాదు -రిపబ్లిక్ డే పరేడ్‌కు ఆటంకాలుండవు: రైతులుఢిల్లీ సరిహద్దుల్లోనే ట్రాక్టర్ ర్యాలీ -ఎర్రకోట వద్ద కాదు -రిపబ్లిక్ డే పరేడ్‌కు ఆటంకాలుండవు: రైతులు

కేంద్రానికి నిజాం మనవడి లేఖ..

కేంద్రానికి నిజాం మనవడి లేఖ..

నిజాం కుటుంబం కీలకంగా భావిస్తోన్న నిజాం జువెల‌రీ ట్ర‌స్ట్ ఆదాయ‌, సంప‌ద ప‌న్నుకు సంబంధించిన వివాదం భారత్ లో 26 ఏళ్లుగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఆదాయ ప‌న్ను శాఖ ద‌గ్గ‌ర ఫైల్ పెండింగ్‌లో ఉంది. సదరు సమస్యను వెంటనే ప‌రిష్క‌రించి, తమ బాకీలు ఇప్పించాలంటూ.. చివ‌రి నిజాం న‌వాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మ‌న‌వ‌డు న‌జ‌ఫ్ అలీ ఖాన్‌.. తాజాగా కేంద్రానికి లేఖ రాశాడు.

సమస్యల నుంచి గట్టెక్కించండి..

సమస్యల నుంచి గట్టెక్కించండి..

నిజాం జువెలరీ వివాదాన్ని పరిష్కరించాలంటూ చివ‌రి నిజాం న‌వాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మ‌న‌వ‌డు న‌జ‌ఫ్ అలీ ఖాన్‌ రాసిన లేఖ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్‌ పరిశీలనలో ఉంది. ట్రంస్టుకు సంబంధించి మొత్తం 114 ల‌బ్ధిదారుల్లో ఇప్పటికే 39 మంది చ‌నిపోయార‌ని, మిగిలిన వాళ్ల‌లో చాలా మంది ఆరోగ్య, ఆర్థిక స‌మస్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ని ఆ లేఖ‌లో న‌జ‌ఫ్ అలీ ఖాన్ చెప్పారు. ఒకప్పుడు నిజాం రాజులు సిరిసంపదలతో తలతూగగా.. ఇప్పుడాయన వారసులు ఇబ్బందుల్లో కూరుకుపోవడం గమనార్హం. నిజానికి..

శోభనం రాత్రే వరుడి ఆత్మహత్య -మేనమామ కూతురుతో ఇటీవలే పెళ్లి -నల్గొండ జిల్లాలో విషాదంశోభనం రాత్రే వరుడి ఆత్మహత్య -మేనమామ కూతురుతో ఇటీవలే పెళ్లి -నల్గొండ జిల్లాలో విషాదం

అస‌లేంటీ వివాదం?

అస‌లేంటీ వివాదం?

ఈ వివాదం ఎక్క‌డ మొద‌లైందో న‌జ‌ఫ్ ఆ లేఖ‌లో వివ‌రించారు. దాని ప్ర‌కారం.. 1950ల‌లో చివ‌రి నిజాం కొన్ని ట్రస్ట్‌ల‌ను ఏర్పాటు చేశారు. అందులో ఒక‌టి నిజాం జువెల‌రీ ట్ర‌స్ట్‌. ఇందులోని న‌గ‌ల‌ను అమ్ముకోవ‌డానికి ట్ర‌స్టీలైన ప్రిన్స్ ముఫ‌ఖ‌మ్ జా, ప్ర‌భుత్వం నామినేట్ చేసిన అధికారికి అధికారం క‌ట్ట‌బెట్టారు. 1995లో ఈ న‌గ‌ల‌ను రూ.206 కోట్ల‌కు కొన‌డానికి ప్ర‌భుత్వం అంగీక‌రించింది. ఈ మొత్తాన్ని నిజాం కుటుంబానికి చెందిన‌ 114 మంది ల‌బ్ధిదారుల‌కు స‌మానంగా పంచారు. అయితే న‌గ‌ల‌ను అప్ప‌గించే స‌మ‌యంలో త‌మ‌కు రూ.30.50 కోట్ల ఆదాయ‌, సంప‌ద ప‌న్ను బాకీ ఉన్న‌దంటూ ఇన్‌క‌మ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ చెప్పింది. ఆ మొత్తాన్ని ఆ రూ.206 కోట్ల నుంచే చెల్లించారు.

నిజాం మనవడి వేడుకోలు..

నిజాం మనవడి వేడుకోలు..

ఈ మొత్తంలో రూ.15.45 కోట్ల‌ను బ‌కాయిల కోసం చెల్లించ‌గా.. వీటిలో చాలా వ‌ర‌కు రీఫండ్స్ రూపంలో వెన‌క్కి వ‌చ్చింది. కానీ ఈ మొత్తాన్ని త‌ప్పుడు అకౌంట్ల‌లో వేశారు. ఇక మిగిలిన రూ.14.05 కోట్ల‌ను భ‌విష్య‌త్తులో ప‌న్ను చెల్లించ‌డం కోసం అప్ప‌టి ఎస్‌బీహెచ్‌లో జ‌మ చేసిన‌ట్లు ఆ లేఖలో న‌జ‌ఫ్ వెల్ల‌డించారు. ఆ బ‌కాయిలు, రీఫండ్స్‌కు సంబంధించిన వివాదం ఇంకా కొన‌సాగుతోంది. ఆ రీఫండ్‌తోపాటు బ్యాంక్‌లో ఉంచిన రూ.14.05 కోట్లు కూడా నిజాం కుటుంబ ల‌బ్ధిదారుల‌కు పంచాల్సి ఉన్నా.. ఆదాయ పన్ను శాఖ మాత్రం పంచ‌డం లేదని న‌జ‌ఫ్ తెలిపారు. తాము క్ర‌మం త‌ప్ప‌కుండా ప‌న్నులు చెల్లిస్తున్నా కూడా ఇన్‌క‌మ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ మాత్రం ఇంకా రూ.8.54 కోట్ల ప‌న్ను బాకీ ఉన్న‌ట్లుగా చెబుతున్న‌ద‌ని, ఇన్నేళ్లుగా ప‌రిష్కారానికి నోచుకోని ఈ స‌మ‌స్య‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని న‌జ‌ఫ్ ఆ లేఖ‌లో కోరారు.

English summary
Najaf Ali Khan, grandson of the last Nizam urged for a one-time settlement to resolve the Nizam Jewellery Trust income and wealth tax issue which has been pending with the tax department for the last 26 years
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X