హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాట్సప్ ద్వారా హైదరాబాద్ మెట్రో రైల్ టికెట్: ఇలా పొందండి, నో టు ‘క్యూ’

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మెట్రో రైలు ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్. ఇకపై వాట్సాప్ ద్వారా కూడా ప్రయాణికులు టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చని అధికారులు తెలిపారు. మెట్రో రైల్ కౌంటర్లలో టిక్కెట్లు కొనేందుకు వరుసలో నిల్చోవాల్సిన అవసరం లేదని అధికారులు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వాట్సాప్ ద్వారా డిజిటల్ పద్ధతిలో నగదు బదిలీ చేయవచ్చన్నారు. దేశంలోనే తొలిసారిగా తాము ప్రయాణికుల సౌకర్యార్థం ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని అధికారులు వివరించారు. ఇందుకోసం బిల్ఈజీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని అధికారులు వెల్లడించారు.

Hyderabad: Now passengers can purchase metro rail ticket via Whatsapp

మెట్రో స్టేషన్ల వద్ద ఉన్న క్యూఆర్ కోడ్‌ను వాట్సాప్ ద్వారా స్కాన్ చేసి కూడా టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చని అధికారులు తెలిపారు. ఇప్పటికే పేటీఎం లాంటి వ్యాలెట్లతో టిక్కెట్లు కొనుగోలుకు అవకాశం ఉన్న విషయం తెలిసిందే. తాజాగా, వాట్సాప్ తోనూ టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ద్వారా మెట్రో టిక్కెట్ కొనుగోలు చేయడం ఎలా అంటే?

మీ ఫోన్ నెంబర్‌తో 8341146468

ఆ తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలి

గమ్యస్థానాన్ని నమోదు చేయాలి

టిక్కెట్ ధరను బదిలీ చేయాలి

దీంతో ఈ-టికెట్ లభిస్తుంది.

English summary
Hyderabad: Now passengers can purchase metro rail ticket via Whatsapp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X