• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కీచక రాజును పట్టిస్తే రూ.10 లక్షలు: నజరానా ప్రకటించిన పోలీసులు

|

సింగరేణి కాలనీలో చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన నిందితుడు రాజు ఇంకా పోలీసులకు చిక్కలేదు. అతను స్మార్ట్ ఫోన్ వాడకపోవడం.. సోషల్ మీడియా సైట్లు యూజ్ చేయకపోవడం వల్ల కనుక్కొవడం కష్టంగా మారింది. నిందితుడిని పట్టుకునేందుకు బృందాలుగా విడిపోయి రాజు కోసం గాలిస్తున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు కీలక ప్రకటన చేశారు. రాజును పట్టిస్తే రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. మరోవైపు రాజును ఎన్‌కౌంటర్ చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. మంత్రి మల్లారెడ్డి కూడా రాజును ఎన్ కౌంటర్ చేస్తామని తెలిపారు.

 మందుకొట్టి..

మందుకొట్టి..

ఘటన జరిగిన రోజు సాయంత్రం ఎల్బీనగర్ వద్ద మరో స్నేహితుడితో కలిసి రాజు మద్యం తాగాడు. ఆ తర్వాత బయటకు నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు ఎల్బీనగర్ వద్ద సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. రాజు స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనకు రాజు చేసిన నేరం తెలియదన్నాడు. మద్యం తాగిన తర్వాత రాజు ఎటు వెళ్లాడో తనకు తెలియదని చెప్పాడు. గతంలో నిందితుడు రాజుపై బైక్ దొంగతనం కేసు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి ప్రవర్తన నచ్చక భార్య వదిలేసి వెళ్లిపోయిందని పోలీసుల విచారణలో తేలింది. నల్గొండ జిల్లాలో ఉన్న రాజు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

ఉరితీయాలని..

ఉరితీయాలని..

చైత్ర ఘటన ప్రతీ ఒక్కరినీ కదిలిస్తోంది. నిందితుడు రాజును కఠినంగా శిక్షించాలనే డిమాండ్ వస్తోంది. ఈ క్రమంలో నేతలు, ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. తాజాగా మంత్రి మల్లారెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టంచేశారు. ఒకడుగు ముందుకేసి చంపేయాల్సిందేనని కామెంట్ చేశారు. ఇటీవల తొడగొట్టి హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సారి కామెంట్ చేసినా.. అదీ ఓ నీచుడి శిక్ష కోసం వ్యాఖ్యలు చేశారు. ఘటనపై రాజకీయ, సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో రియాక్టయ్యారు. హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. మంత్రి మల్లారెడ్డి మరో అడుగు ముందుకేశారు. ఇది చాలా ఘోరం. తప్పకుండా వాడిని ఎన్ కౌంటర్ చేయాలని కోరారు. ఎన్ కౌంటర్ చేస్తాం.. విడిచిపెట్టేదే లేదన్నారు. ఫ్యామిలీ వద్దకెళ్లి పరామర్శించడం మాత్రమే కాదు. కుటుంబానికి న్యాయం చేస్తాం అని తెలిపారు. ఆ కుటుంబాన్ని అన్నిరకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. నిందితుడిని ఎన్ కౌంటర్ చేస్తాం అని మంత్రి మల్లారెడ్డి అన్నారు.

దారుణ ఘటన

దారుణ ఘటన

ఆరేళ్ల పాపపై ఓ కామాంధుడు అకృత్యానికి ఒడిగట్టాడు. చిన్నారిని రేప్ చేసి దారుణంగా చంపేశాడు. స్థానికంగా ఉండే రాజు అనే ఆటో డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. సింగరేణి కాలనీలో గురువారం సాయంత్రం 5 గంటల నుంచి పాప కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా గాలించారు. రాత్రయ్యే వరకూ ఆచూకీ తెలియకపోవడంతో ఆ ఏరియాలో జులాయిగా తిరిగే రాజుపై స్థానికులకు అనుమానం వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా చందంపేట్ మండలం నుంచి హైదరాబాద్ వచ్చి ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. చిల్లర దొంగతనాలు చేస్తూ ఆ ఏరియాలో జనాలతో దురుసుగా వ్యవహరిస్తూ ఉండేవాడు. దీంతో అతడు పాపను ఏమైనా చేశాడేమోననే అనుమానంతో అర్థరాత్రి సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా అతని గదిలో ఆ చిన్నారి విగత జీవిగా పడి ఉంది. సాయంత్రం వరకూ ఆడుకుంటూ కనిపించిన తమ బిడ్డ అలా ఓ కిరాతకుడికి బలైపోవడం చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబసభ్యులు, స్థానికులు కూడా కంటతడపెట్టారు.

English summary
hyderabad police annouced 10 lakhs reward. who catched child rape accused raju.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X