Hyderabad Population: హైదరాబాద్ జనాభా ఎంత.. ఎవరెంత మంది ఉన్నారంటే..!

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఆవతరించింది. చైనాను దాటేసి అత్యధిక జనాభా గల దేశంగా మారింది. ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (UNFPA) తాజా నివేదిక ప్రకారం, 1,428.6 మిలియన్ల జనాభాతో భారత్ చైనాను అధిగమించింది. చైనా కంటే 2.9 మిలియన్ల ఎక్కువ జనాభా ఇండియా దూసుకెళ్తోంది. భారత జనాభాలో 25 శాతం మంది 0-14 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు ఉన్నారు. 18 శాతం మంది 10-19 మధ్య వయస్సు గలవారు ఉండగా.. 26 శాతం మంది 10-24 సంవత్సరాల వయస్సు గలవారు అని నివేదిక వెల్లడించింది. 68 శాతం మంది 15-64 ఏళ్ల కేటగిరీలో ఉన్నారు. 7 శాతం మంది మాత్రమే 65 ఏళ్లు పైబడిన వారని నివేదిక పేర్కొంది.

చైనా జనాభాలో 14 ఏళ్లలోపు 17 శాతం మంది ఉండగా.. 10-19 ఏళ్లలోపు 12 శాతం, 10-24 ఏళ్ల వారు 18 శాతం మంది ఉన్నారు. ఇండియాలో అత్యధిక జనాభా కలిగిన నగరంగా ముంబై నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీ ఉంది. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన మొదటి 10 నగరాలలో హైదరాబాద్ చోటు దక్కించుకుంది. హైదరాబాద్‌(Hyderabad Population)లో 1.05 కోట్ల జనాభా ఉందని నివేదిక వెల్లడించింది. మూసీ నది ఒడ్డున దక్కన్ పీఠభూమిలో 650 చ.కి.మీ విస్తరించి ఉన్న నగరంలో అరకోటికి పైగా జనాభా ఉన్నట్లు తెలిపింది.

Hyderabad Population has increased

హైదరాబాద్ ను 1591లో ముహమ్మద్ కులీ కుతుబ్ షాచే నిర్మించాడు. 1956 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్.. 2014 నుంచి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధానిగా కొనసాగుతోంది. జనాభా లెక్కల ప్రకారం, హైదరాబాద్ జనాభాలో 64.93 శాతం హిందువులు, 30.13 శాతం ముస్లింలు, 2.75 శాతం క్రైస్తవులు, 2.19 శాతం ఇతర మతాలకు చెందినవారు ఉన్నారు. 1950లో జనాభా డేటాను సేకరించడం ప్రారంభించినప్పటి నుంచి మొదటిసారిగా భారత్ UN జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.

మరోవైపు 1960 తర్వాత మొదటిసారిగా చైనా జనాభా తగ్గిందని నివేదిక పేర్కొంది. అధిక జనాభా భయాలతో చైనా 1980లలో కఠినమైన "ఒక బిడ్డ విధానాన్ని" విధించింది. కానీ 2016లో ఆ విధానాన్ని ఎత్తివేసింది. దేశంలోని శ్రామిక శక్తి వయస్సు, సంతానోత్పత్తి రేట్లు తగ్గుతున్నందున ఈ నిర్ణయం తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+