హైదరాబాద్ మహిళకు రూ. 2 కోట్ల దుబాయ్ లాటరీ తగిలింది! రూ. 100 టికెట్‌తో!!
హైదరాబాద్: నగరానికి చెందిన అమ్మాయికి దుబాయ్ లాటరీ తగిలింది. రూ. 100తో కొనుగోలు లాటరీ చేయగా.. ఏకంగా రూ. 2.20 కోట్లను గెలుచుకుంది. దుబాయ్‌లో హైదరాబాద్ నగరానికి చెందిన మహిళ ఇలాంటి లాటరీ గెలవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. హైదరాబాద్ నగరానికి చెందిన హమీద బేగం అనే మహిళ.. అబుదాబిలో రూ. 2.2 కోట్ల రూపాయల లాటరీ గెలుచుకున్నారు.
కాగా, ఈమె అబుదాబిలో నివసిస్తోంది. మూడేళ్లుగా మెడికల్ కోడర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో రెగ్యూలర్‌గా ఓ సంస్థ నిర్వహించే లాటరీలో.. రూ. 100తో టికెట్ కొనుగోలు చేసింది. అయితే, ఆమెను ఊహించని విధంగా అదృష్టం వరించింది.

ఈ లాటరీ లక్కీ డ్రాలో బేగం కొనుగోలు చేసిన టికెట్‌కు ప్రైజ్ మనీ వచ్చింది. లాటరీ తగలడం తనకు ఆనందంగా ఉందని హమీద బేగం చెప్పింది. గెలుచుకున్న డబ్బును తన నలుగురి పిల్లల చదువు, వారి పోషణ కోసం ఖర్చు చేస్తానని ఆమె తెలిపింది. అంతేగాక, ఈమె లక్కీ డ్రాలో 10 లక్షల దిర్హామ్‌లు గెలుచుకున్న తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఎక్కువగా ఈ లాటరీల్లో పురుషులే పాల్గొంటారు.












Click it and Unblock the Notifications