Hydra: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. హైడ్రా కీలక నిర్ణయం..!
హైదరాబాద్ లోని చెరువులు, పార్కులను కాపాడడమే లక్ష్యంగా హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో హైడ్రా అనేక ప్రభుత్వ భూములు, పార్కులను కాపాడింది. అంతే కాదు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అయితే హైడ్రా మొదట్లో ఉన్నంత అగ్రేసివ్ గా లేదు. స్పీడ్ చాలా తగ్గింది. అప్పుడప్పుడు అక్కడక్కడ కబ్జా చేసి చేపట్టిన నిర్మాణలను ధ్వంసం చేస్తోంది. తాజాగా హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అండ్ రీజినల్ అథారిటీ (హైడ్రా) జనవరి 2025 నుంచి ప్రతి సోమవారం ఫిర్యాదులను స్వీకరించనుంది. ప్రజా వాణి లాగా ఒక రోజు ఫిర్యాదులకు కేటాయించనున్నారు. బుద్ధ భవన్‌లో ఫిర్యాదులు స్వీకరించే అవకాశం ఉంది. ఇక్కడ పౌరులు నేరుగా హైడ్రా సీనియర్ అధికారులతో తమ సమస్యలను తెలియజేయవచ్చు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం హైడ్రాకు రూ.50 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ నిధులు హైడ్రా కార్యాలయ నిర్వహణ, కొత్త వాహనాల కొనుగోలు, ఇప్పటివరకు కూల్చివేతలకు సంబంధించిన ఖర్చుల కోసం ఉపయోగించనున్నారు. తెలంగాణ బడ్జెట్‌లో హైడ్రా కోసం మొత్తం రూ.200 కోట్లు కేటాయించారు. తొలివిడతగా రూ.50 కోట్లు విడుదల చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో ప్రభుత్వ చెరువులు, పార్కులు కబ్జా కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలై 12 న హైడ్రాను ఏర్పాటు చేశారు.
ఆగస్టు నాటికి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) పరిధిలో 43.94 ఎకరాల ఆక్రమణకు గురైన భూమిని హైడ్రా స్వాధీనం చేసుకున్నారు. సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా సంచలనంగా మారింది. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో ఆక్రమణలను కూల్చివేశారు.












Click it and Unblock the Notifications