హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, నోటీసుకు రిప్లై ఇచ్చా: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్‌గా ఉంది. అతని సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి మునుగోడు అభ్యర్థిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ వెంకట్ రెడ్డి పార్టీ తరఫున ప్రచారం చేయలేదు. సరికదా విదేశాలకు వెళ్లి.. తన తమ్ముడికి సపోర్ట్ చేయాలని అన్నారట. ఆ వీడియో ట్రోల్ కావడంతో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీచేసింది. రెండుసార్లు జారీచేసిందని.. ఆ పార్టీ చెబుతుండగా, ఇప్పటికే తాను వివరణ ఇచ్చానని వెంకట్ రెడ్డి తెలిపారు.

కాంగ్రెస్‌లోనే ఉన్నా..

కాంగ్రెస్‌లోనే ఉన్నా..


కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత జైరాం రమేశ్ సీరియస్ అయ్యారు. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం అని తెలిపారు. గీత దాటితే చర్యలు తప్పవని ఒకింత ఘాటుగానే చెప్పారు. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని తెలిపారు. షోకాజ్ నోటీసుకు రెండు రోజుల క్రితమే సమాధానం ఇచ్చానని తెలిపారు. డిసిప్లినరీ కమిటీ చైర్మన్ తారిక్ ఆన్వర్ ఆందుబాటులో లేరని వివరించారు.

పనుల కోసం తిరుగుతూ..

పనుల కోసం తిరుగుతూ..


ప్రస్తుతం తన నియోజకవర్గ పనుల కోసం తిరుగుతున్నానని చెప్పారు. షోకాజ్ నోటీసు ఇచ్చిన సమయంలో పాదయాత్రలో ఎలా పాల్గొనాలని ఎదురు ప్రశ్నించారు. క్లీన్ చీట్ వచ్చాకే జోడో యాత్రలో పాల్గొంటానని వెంకట్రెడ్డి స్పష్టం చేశారు.కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

ఇండైరెక్టుగా హెల్ప్

ఇండైరెక్టుగా హెల్ప్

తమ్ముడి కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరోక్షంగా సహకరించారనే ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతిని పట్టించుకోలేదని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారట. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో స్రవంతికి డిపాజిట్లు కూడా దక్కలేదు. దీనిని కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

English summary
iam in congress party komatireddy venkat reddy said. as jairam ramesh serious about venkat reddy behaviour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X