దేశవ్యాప్తంగా మొదటిస్థానంలో నిలిచిన సమంత
అగ్ర కథానాయిక సమంతకు (Samantha) ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలకు మించి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఆమె సొంతం చేసుకున్నారు. సినిమా హిట్‌లతో సంబంధం లేకుండా రోజురోజుకు అభిమానులను పెంచుకుంటోంది ఈ అమ్మడు. తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న అగ్ర తారలను వెనక్కునెట్టి పాపులర్ ఇండియన్ సెలబ్రెటీ లిస్ట్‌లో మొదటిస్థానంలో నిలిచింది. ఐఎమ్‌డీబీ విడుదల చేసిన ఈ జాబితాలో సామ్ ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ప్రతి సినిమాతో పాటు వెబ్ సిరీస్‌లకు ప్రేక్షకుల స్పందనను బట్టి ఐఎండీబీ (ఇండియన్ మూవీ డేటాబేస్) రేటింగ్స్ ఇస్తుంటుంది. మన దేశంలో పాపులర్ స్టార్ ఎవరనే విషయాన్ని ప్రేక్షకుల స్పందనను బట్టి ఇస్తుంటుంది.

తాజాగా పాపులర్ ఇండియన్ సెలబ్రెటీల జాబితాను ప్రకటించగా సమంత మొదటి స్థానంలో నిలిచింది. గతంలో తొమ్మిదో స్థానంలో ఉన్న సమంత ఈసారి ఫస్ట్ ప్లేస్‌కు రావడం విశేషం. ఇదే లిస్ట్‌లో పూజా హెగ్డే 17వ స్థానంలో నిలబడింది. ఇప్పటికే ఆర్మాక్స్ లిస్టులో సమంత ఏడు పర్యాయాల నుంచి టాప్‌లో ఉంటోంది.
'శాకుంతలం' (Shaakuntalam) సినిమాతో సామ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆమెకే కాకుండా ఆమె అభిమానులకు కూడా నిరాశను మిగిల్చింది. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో కలిసి 'ఖుషి'లో నటిస్తోంది. దీంతోపాటు సిటాడెల్' వెబ్‌సిరీస్ తెలుగు భాగంలో కూడా నటిస్తోంది. ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాల కోసం సమంత బాగా కష్టపడుతోంది. యాక్షన్ సన్నివేశాల్లో నటించాక అలసట తీరడం కోసం ఐస్ బాత్ చేస్తున్నట్లు తెలిపింది












Click it and Unblock the Notifications