ఇండియాలో సూపర్ లగ్జరీ రైళ్లు

మనదేశంలోని హై-ఎండ్ లగ్జరీ రైళ్లు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి. దాంతోపాటు చరిత్ర, వారసత్వం వివరాలను కూడా అందజేస్తాయి. ఇందులో ప్రయాణం చేసేటప్పుడు మనం కూడా చక్రవర్తులనే, రాజులనే అనుభూతిని కలిగిస్తాయి. అయితే వీటిల్లో ప్రయాణించాలంటే లక్షల రూపాయల ఖర్చవుతుంది. అయినా వీటిల్లోని ప్రయాణ అనుభవం మాత్రం మరుపురానిదిగా నిలుస్తుంది. భారత్ లోని అత్యంత సూపర్ లగ్జరీ రైళ్ల వివరాలను తెలుసుకుందాం.

మహారాజాస్ ఎక్స్ ప్రెస్
ఈ రైలు అర మైలు పొడవుతుంటుంది. ఇందులో ఆతిత్యం అత్యుత్తమ స్థాయిలో ఉంటుంది. బార్లు, విలాసవంతమైన అపార్ట్ మెంట్లు, బట్లర్ సేవలతోపాటు ఇతరత్రా సేవలందించడానికి శిక్షణ తీసుకున్న నిపుణులు ఉంటారు. మనదేశంలోని అత్యంత ఖరీదైన రైళ్లల్లో ఇది కూడా ఒకటి.

indian super luxury trains details

ప్యాలెస్ ఆన్ వీల్స్
ప్రపంచంలోని అత్యుత్తమ రాయల్ రైళ్లల్లో ఇది కూడా ఒకటి. విలాసవంతమైన వసతితోపాటు చక్కటి వాల్ పేపర్లు, బార్లు, ఆతిథ్యం, పెయింటింగ్స్, హస్తకళలు, సృజనాత్మకత లాంటి ప్రదర్శనలను అందిస్తుంది.

దక్కన్ ఒడిస్సీ
రైలు చక్రాలపై ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ ఇది. దక్కన్ ఒడిస్సీ వివిధ రాచరికపు చరిత్రల నుంచి, పురాతర భారతదేశ చక్రవర్తులు, రాజులు, పాలకుల ప్రయాణ శైలి నుంచి ప్రేరణ పొంది తయారుచేయబడింది. అత్యంత అద్భుతంగా ఉంటుంది.

గోల్డెన్ చారియట్ రైలు
ఇది బంగారు రథంగా పేరు తెచ్చుకుంది. 2008లో దీన్ని ప్రారంభించారు. అసాధారణమైన సేవలకు ప్రసిద్ధి చెందింది. రాయల్ ఇంటీరియర్ తో ఏసీ ఛాంబర్లు, బార్లు, రెస్టారెంట్లతో అత్యంత విలాసవంతంగా ఉంటుంది.

మహా పరినిర్వాణ్ రైలు
దీన్ని బౌద్ధ సర్క్యూట్ రైలు అని కూడా అంటారు. ఇందులో గ్రంథాలయం, వంటగది, రెస్టారెంట్, మసాజ్ పార్లర్ లాంటి సౌకర్యాలుంటాయి. ఇందులో ప్రయాణించాలంటే కనీసం రూ.2 లక్షలను ఖర్చుచేయాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+