తెలంగాణలో ఇంటర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల.. వితౌట్ ఫైన్ చెల్లించే తేదీ ఇదే
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్ష ఫీజు షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఫీజు చెల్లింపునకు ఫిబ్రవరి 11 వరకు తుది గడువు ఇచ్చారు. రూ.100 రుసుముతో ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు, రూ.500 రుసుముతో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 2 వరకు చెల్లించే అవకాశం కల్పించారు. రూ.వెయ్యి ఆలస్య రుసుముతో మార్చి 9 వరకు ఫీజు ఫీజు చెల్లించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు వెసులుబాటు కల్పించింది.
రాష్ట్రంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మే 1వ తేదీ నుంచి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మే-2 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలను నిర్వహిస్తారు. ఇంటర్ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఫీజు చెల్లించే తేదీని ప్రకటించారు.

జేఈఈ మెయిన్ చివరి విడత పరీక్షకు మూడు రోజుల ముందు సెకండ్ ఇయర్ పరీక్షలు ముగిసేలా షెడ్యూల్ రూపొందించారు. ఇందుకోసం ఈసారి ప్రత్యేకంగా ఆదివారం కూడా పరీక్ష నిర్వహింంచాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో తరగతులు సరిగా జరగని సంగతి తెలిసిందే. ఆన్ లైన్ క్లాసులు జరిగినా.. అందులో సవాలక్ష లోపాలు కనిపించాయి. ఏప్రిల్ 7 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష ఏప్రిల్ 1న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఏప్రిల్ 3న జరగనుంది.












Click it and Unblock the Notifications