యశోదా ఆస్పత్రుల్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు: పన్ను చెల్లింపుల్లో తేడాలు
హైదరాబాద్: నగరంలోని మూడు యశోద ఆస్పత్రుల్లో ఆదాయపుపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గత రెండ్రోజులుగా డాక్టర్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. బుధవారం కూడా యశోద ఆస్పత్రిలో ఐటీ రిటర్నులపై ఆరా తీస్తున్నారు.
అందాలతో ఆకట్టుకొంటున్న దివ్య దురైసామి.. ఒంపు సొంపులతో..
చేస్తున్నారు. బుధవారం కూడా యశోద హాస్పిటల్స్ లో ఐటీ రిటర్న్స్ పై ఆరా తీస్తున్నారు అధికారులు. సికింద్రాబాద్, సోమాజిగూడ, మలక్ పేటలోని యశోద హాస్పిటల్స్ కి చెందిన ప్రముఖ డాక్టర్లు, ప్రమోటర్ల నివాసంలో తనిఖీలు చేపట్టారు.

20కిపైగా ఐటీ శాఖ బృందాలు.. యశోదా ఆస్పత్రి మూడు బ్రాంచీలకు చెందిన ముగ్గురు డైరెక్టర్ల ఇళ్లతోపాటు కార్పొరేట్ ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. ఆస్పత్రి డైరెక్టర్లు సోమాజిగూడలో సురేందర్ రావు, సికింద్రాబాద్‌లో రవీంద్ రావు, మలక్‌పేటలో దేవేందర్ రావుల ఇళ్లల్లో సోదాలు చేశారు.
శరణ్య రవిచంద్రన్ హాట్ ఫోటో గ్యాలరీ..
నాగార్జున్ హిల్స్‌లోని కార్పొరేట్ ఆఫీసులో సోదాలు కూడా ఐటీ అధికారులు దాడులు చేశారు. ఆదాయపుపన్ను చెల్లింపుల్లో తేడాలు ఉన్నట్లు ఐటీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మంగళవారం నుంచి ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.
మంగళవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఐటీ సోదాలు జరిగినట్లు సమాచారం. బుధవారం నాడు కూడా ఐటీ అధికారులు దాడులు కొనసాగించారు. ఈ సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.