Johnny Master: సైబారాబాద్ ఎస్వోటీ పోలీసుల అదుపులో జానీ మాస్టర్..!
సైబారాబాద్ పోలీసులు జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. గోవాలో ఉన్న అతన్ని ను ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అతను లడఖ్, నెల్లూరులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో నాలుగు బృందాలుగా మారిన పోలీసులు లడఖ్, నెల్లూరు గాలింపు చేపట్టాయి. బెంగళూరులో జానీ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే అక్కడకి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
జానీ మాస్టర్ వద్ద పని చేసిన ఓ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను జానీ మాస్టర్ లైంగికంగా వేధించాడని.. పలుమార్లు అత్యాచారం కూడా చేశాడని పేర్కొంది. ఆమె మొదటగా రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఆమె నివాసం ఉంటున్న ఇల్లు నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు కేసును నార్సింగి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.

దీంతో పోలీసులు జానీ మాస్టర్ పై 376 అత్యాచారం కేసుతో పాటు పలు సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు. బుధవారం ఫోక్సో కేసు కూడా నమోదు చేశారు. తనపై కేసు నమోదు కావడంతో జానీ మాస్టర్ తప్పించుకుని తిరుగుతున్నాడు. అతని కోసం పోలీసులు ఐదు రోజులుగా వెతుకుతున్నాడు. చివరికి అతన్ని గోవాలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. జానీని సాయంత్రం లేదు రాత్రి వరకు హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశం ఉంది.
ఆ తర్వాత అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అలాగే పోలీసులు జానీ మాస్టర్ ను కస్టడీ కోరే అవకాశం ఉంది. జానీ మాస్టర్ పై కేసు నమోదు అయిందని తెలియగానే.. జనసేన అతన్ని పార్టీ కార్యక్రమాల నుంచి దూరంగా ఉండాలని ఆదేశించింది. మరోవైపు తెలుపు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ కూడా ఈ విషయమై విచారణ చేస్తోంది. కాగా బాధితురాలికి ఓ పెద్ద హీరో అండగా నిలిచాడని యాంకర్, యాక్టర్ ఝాన్సీ తెలిపారు. ఆ బాడా హీరో అల్లు అర్జునే అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications