హైకోర్టుకు చేరిన జర్నలిస్ట్ రఘు అరెస్ట్ ఇష్యూ.. రిట్ పిటిషన్ దాఖలు.. ప్రతివాదులకు నోటీసులు
జర్నలిస్ట్ రఘును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన భార్య లక్ష్మీప్రవీణ హైకోర్టును ఆశ్రయించారు. రఘును అక్రమంగా అరెస్ట్ చేశారని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ప్రతివాదులకు నోటీసులిచ్చింది. అరెస్ట్ అక్రమమో.. కాదో తేలుస్తామని హైకోర్టు పేర్కొంది. బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లాలని హైకోర్టు సూచించింది. మరోవైపు రఘు అరెస్ట్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పుపట్టారు. కేసీఆర్ నియంతృత్వ పోకడకు నిదర్శనం అంటూ మండిపడ్డారు.

సమాచారం లేకుండా అదుపులోకి..
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రబోడు తండా దాడి ఘటనకు సంబంధించిన కేసులో జర్నలిస్ట్ రఘు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటి నుంచి టూ వీలర్‌పై బయటకు వెళ్లిన రఘును మధ్యలో అడ్డుకుని జీపులో ఎక్కించారు. పోలీసులు రఘును అదుపులోకి తీసుకున్న తీరు.. అరెస్ట్‌కు ముందు కుటుంబసభ్యులకు ఎలాంటి సమాచారం అందించకపోవడంతో కిడ్నాప్ అంటూ కలకలం రేగిన విషయం తెలిసిందే.

వ్యతిరేక కథనాలు
ఇటీవల జర్నలిస్ట్ రఘు పలు సంచలన కథనాలను ప్రసారం చేశారు. తొలివెలుగు యూట్యూబ్ చానల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు ప్రసారం అయ్యాయి. మరోవైపు తెలంగాణ వాదులను, టీఆర్ఎస్ను గట్టిగా వ్యతిరేకించే వాళ్లను రఘు నిత్యం ఇంటర్వ్యూ చేస్తుంటారు. ఈ క్రమంలో ఆయన ఒక్కసారిగా కనిపించకుండా పోవడం చర్చకు దారితీసింది.

ఎందుకు అరెస్ట్ చేశారంటే..?
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తండా 540 సర్వే నంబర్ ఘర్షణ జరిగింది. ఈ కేసులో నిందితుడిగా జర్నలిస్ట్ రఘు ఉన్నారు. ఆయనను నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత హుజుర్ నగర్ జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. తర్వాత అతనిని హుజూర్ నగర్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. జర్నలిస్టులలో డేరింగ్ అండ్ డాషింగ్ గా రఘుకి పేరుంది. ఆయన అరెస్ట్ చేయడాన్ని భార్య హైకోర్టులో పిటిషన్ వేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications