హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్: నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే: పవన్ కల్యాణ్

|
Google Oneindia TeluguNews

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ పెను దుమారం రేపుతోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వస్తోంది. ఘటనపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితులు మైనర్లు అయినప్పటికీ వదలొద్దని స్పష్టంచేశారు. నిందితులు చిన్నవారైనా, పెద్దవారైనా కఠినంగా శిక్షించాలన్నారు.

నిందితులు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబెట్టాలని కోరారు. అత్యాచారం ఆలోచనే రానివ్వని శిక్షలు అవసరం అని అభిప్రాయపడ్డారు. దోషుల కుటుంబాలకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. ఇటులో కూడా ఏపీలో తరుచూగా ఘోరాలు జరుగుతూనే ఉన్నాయని పవన్ వాపోయారు. సమైలంగా నిర్మూలించాలని ఆయన కోరారు.

jubilee hills rape case culprits are must punished:pawan kalyan

జూబ్లీహిల్స్ లైంగికదాడి ఘటనలో మరో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రోజుకో అంశం బయట పడుతుంది. కర్ణాటక గుల్బర్గాలో మైనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఓ రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారు. పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో యువకుడు పరారీలో ఉన్నాడు. హైదరాబాద్ శివారు మొయినాబాద్‌లో గల ఫాం హౌస్ వద్ద ఇన్నోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ రాజకీయ నేతకు చెందిన ఫాం హౌస్‌లో తలదాచుకున్నారని తెలుస్తోంది. అక్కడి నుంచే వేర్వేరు ప్రాంతాలకు పరారయ్యారు. ఇన్నోవా కారును ఆ ఫాం హౌస్ వెనుక దాచినట్టు సమాచారం. మరోవైపు బాధితురాలి స్టేట్ మెంట్‌ను పోలీసులు మరోసారి తీసుకున్నారు. ఇటు కేసును మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది.

English summary
jubilee hills rape case culprits are must be punished janasena chief pawan kalyan said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X