జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు: ఆ ఫామ్‌హౌస్‌లో నక్కిన నిందితులు.. ఆశ్రయం ఇచ్చింది ఎవరంటే..?

రొమెనియాకు చెందిన మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ మండు వేసవిలో సెగలు పుట్టిస్తోంది. రేప్ తర్వాత జరిగిన పరిణామాలు రోజు రోజుకు మారుతున్నాయి. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారికి ఆశ్రయం ఇచ్చింది ఎవరూ.. బెంజ్ కారు నుంచి ఇన్నొవాలకు ఎలా మారారనే ప్రశ్నలు మెదడును తొలచివేస్తున్నాయి. దీనికి సంబంధించి మరో కొత్త విషయం వెలుగుచూసింది.

ఆ ఫామ్ హౌస్ ఎవరిదీ..?

ఆ ఫామ్ హౌస్ ఎవరిదీ..?

జూబ్లీహిల్స్ లైంగికదాడి ఘటనలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక గుల్బర్గాలో మైనర్‌ను నిన్న రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఓ రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారు. పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో యువకుడు పరారీలో ఉన్నాడు. హైదరాబాద్ శివారు మొయినాబాద్‌లో గల ఫాం హౌస్ వద్ద ఇన్నోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ రాజకీయ నేతకు చెందిన ఫాం హౌస్‌లో తలదాచుకున్నారని తెలుస్తోంది. అక్కడి నుంచే వేర్వేరు ప్రాంతాలకు పరారయ్యారు. ఇన్నోవా కారును ఆ ఫాం హౌస్ వెనుక దాచినట్టు సమాచారం.

గోవా- కర్ణాటక

గోవా- కర్ణాటక

నిందితులు ఫోన్లలో తమ సిమ్ కార్డులను వేసి వారిని గోవాకు పంపించారని, ఆ తర్వాత వీళ్లు కర్ణాటకకు పారిపోయారని సమాచారం. నిందితులకు ఆశ్రయం ఇచ్చిన ఫాం హౌస్ యజమాని వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసులో ఓ నిందితుడి తండ్రి అయిన చైర్మన్ దే ఆ ఫాం హౌస్ అని ప్రాథమికంగా నిర్ధారించారు. మరో నిందితుడు ఉమేర్ ఖాన్‌ను జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు.

11 ఏళ్ల బాలిక కిడ్నాప్

11 ఏళ్ల బాలిక కిడ్నాప్

జూబ్లీహిల్స్‌లో లైంగికదాడి ఘటన పెను దుమారం రేపుతుంది. ఘటన మరవకముందే హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. 11 ఏళ్ల బాలికను క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేశాడు. నాలుగు రోజుల క్రితం మొఘల్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. సుల్తాన్ షాహీ ప్రాంతానికి చెందిన బాలిక షాహీన్ నగర్‌లో గల బంధువుల ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా లుక్మాన్ అనే క్యాబ్ డ్రైవర్.. ఇంటి వద్ద విడిచిపెడతానంటూ కారు ఎక్కించుకున్నాడు.

ఇద్దరు అరెస్ట్

ఇద్దరు అరెస్ట్

రంగారెడ్డి జిల్లా కొందుర్గ్‌కు తీసుకెళ్లాడు. బాలికను మళ్లీ సుల్తాన్ షాహీ ప్రాంతంలో నిన్న ఉదయం వదిలి వెళ్లాడు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. లుక్మాన్‌తోపాటు అతడికి సహకరించిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. అత్యాచారం జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కొందుర్గ్‌లో లుక్మాన్‌కు ఎవరు ఆశ్రయమిచ్చారనే అంశంపై విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+