అప్పుడు ఆవిర్భావ వేడుకలు చేయండి.. కేఏ పాల్ సంచలనం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రేపే.. అందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత ఏడేళ్ల నుంచి వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. అయితే దీనిపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పందించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. కేసీఆర్ కుటుంబ దినోత్సవంగా మారిందని పాల్ విమర్శించారు. తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలు చీకటిలో ముగ్గుతున్నాయని తీవ్ర విమర్శలు చేశారు.

 ఆ బాధ ఎప్పటికీ తీరేను..

ఆ బాధ ఎప్పటికీ తీరేను..


తెలంగాణ సాధనలో అమరులైన వారి కుటుంబాల బాధ ఎప్పటికి తీరుతుందని ప్రశ్నించారు. వారి గోస వింటుంటే గుండె తరుక్కుపోతుందని.. కన్నీళ్లు ఆగడంలేదన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం 1200 మంది అమరులైతే.. టీఆర్ఎస్ సర్కార్ కనీసం ఆయా కుటుంబాలను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. గత ఎనిమిదేళ్లలో కేసీఆర్ చేసిందేమీలేదని ఫైరయ్యారు.

అమరులు త్యాగం..

అమరులు త్యాగం..


రాష్ట్రం కోసం త్యాగాలు అమరుల కుటుంబాలు చేస్తే.. భోగాలు కేసీఆర్ కుటుంబానివా అని మండిపడ్డారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు ఆవిర్భావ వేడుకలు బహిష్కరించాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు. ఇటీవల కేఏ పాల్ యాక్టివ్ అయ్యారు. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు. ప్రతిపక్ష నేత మాదిరిగా కామెంట్స్ చేస్తున్నారు.

 దాడితో యాక్టివ్..

దాడితో యాక్టివ్..


కేఏ పాల్‌పై ఇటీవల సిద్దిపేటలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన పొలిటికల్‌గా బిజీ అయిపోయారు. సిద్ధిపేట జిల్లా జక్కపూర్ గ్రామంలో ఆయన చెంపచెల్ అనిపించాడు. కేఏ పాల్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్ల పల్లి మండలం బస్వాపూర్‌లో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వెళుతున్నారు. పోలీసులు జక్కాపూర్ వద్ద అడ్డుకున్నారు. మాట్లాడుతుండగా అక్కడే ఉన్న ఓ యువకుడు దాడి చేశాడు. కేఏ పాల్‌ను చెంప మీద కొట్టాడు. దాడి చేసిన యువకుడితో కేఏ పాల్ అనుచరులు గొడవకు దిగారు. ఆ తర్వాత డీజీపీని కలిసే ప్రయత్నం చేయడం.. హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ కూడా అయ్యారు. తర్వాత రోజు మీడియాతో మాట్లాడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+