హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేఏ పాల్ సంచలనం: టీఆర్ఎస్‌కు 28 సీట్లు కన్నా ఎక్కువ రావట, పీకే చెప్పారట.. హౌస్ అరెస్ట్

|
Google Oneindia TeluguNews

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై నిన్న దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ అంశంపై ఇవాళ డీజీపీ కార్యాలయానికి ఆయన బయల్దేరారు. అయితే హైదరాబాద్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అపాయింట్ మెంట్ లేకుండా వస్తున్నారని సమాచారంతో పోలీసులు అమీర్ పేట్‌లో గల నివాసం వద్దే అడ్డుకున్నారు. ఇంటి నుంచి బయటకు పంపించలేదు.

 డీజీపీకి ఫిర్యాదు చేయడానికి వస్తే..

డీజీపీకి ఫిర్యాదు చేయడానికి వస్తే..


సిరిసిల్లలో నిన్న కేఏ పాల్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ కార్యకర్త ఒకరు దాడి చేశారు. ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు పాల్ వెళ్తున్న నేపథ్యంలో ఆయనను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కేఏ పాల్ ఇంటి నుంచి బయటకు వస్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండొచ్చని వారు అంటున్నారు. రంజాన్ నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి తన కార్యాలయానికి రాలేదు. ఇంతలో పాల్ వెళ్లాలని అనుకోవడం.. అతని హౌస్ అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి.

 కేసీఆర్, కేటీఆర్‌పై విమర్శలు

కేసీఆర్, కేటీఆర్‌పై విమర్శలు


సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ పార్టీ నేతలపై కేఏ పాల్ విమర్శలు చేశారు. సిరిసిల్ల ఎస్పీతో నిన్న కేటీఆర్ మాట్లాడిన తర్వాతే తనపై దాడి జరిగిందని ఆరోపించారు. తొలుత 15 నుంచి 20 మంది పోలీసులు వచ్చారని, ఆ తర్వాత డీఎస్పీ, సీఐ వచ్చారని... అనంతరం తనను కొట్టిన వ్యక్తితో పోలీసులు బ్లూటూత్‌తో మాట్లాడారని చెప్పారు. ఆ తర్వాత తనపై దాడి జరిగిందని చెప్పారు.

 కేటీఆర్ మనిషే దాడి..

కేటీఆర్ మనిషే దాడి..


దాడి చేసింది కేటీఆర్ మనిషేనని కేఏ పాల్ అన్నారు. తాను రైతులకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని చెప్పారు. అధికార పార్టీ కోసం పోలీసులు పని చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో నిన్న మాట్లాడానని... వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 28 స్థానాల కంటే ఎక్కువ రావనే విషయాన్ని కేసీఆర్‌కు చెప్పానని.. పీకే తనతో అన్నారని తెలిపారు. పీకేని పార్టీ పెట్టమని చెప్పింది కేసీఆరే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పాల్ చెంప‌చెల్‌మంది

పాల్ చెంప‌చెల్‌మంది


ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై నిన్న దాడి జరిగింది. సిద్ధిపేట జిల్లా జక్కపూర్ గ్రామంలో అటాక్ జరిగింది. ఆయన చెంపచెల్ అనిపించిన వ్యక్తి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అని తెలుస్తోంది. కేఏ పాల్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్ల పల్లి మండలం బస్వాపూర్‌లో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వెళుతున్నారు. ఆయనను పోలీసులు జక్కాపూర్ వద్ద అడ్డుకున్నారు. మాట్లాడుతుండగా అక్కడే ఉన్న ఓ యువకుడు దాడి చేశాడు. కేఏ పాల్‌ను చెంప దెబ్బ కొట్టాడు. హఠాత్ పరిణామంతో ఒక్కసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాడి చేసిన యువకుడితో కేఏ పాల్ అనుచరులు గొడవకు దిగారు. దాడి చేసిన యువకుడు టీఆర్‌ఎస్ నాయకుడిగా తెలుస్తోంది. తనపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.

English summary
prajasanti party chief ka paul made sensational comments on trs party seats. 28 seats only trs get he told.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X