కార్వీ ఎండీ పార్థసారధి రెడ్డి అరెస్ట్: 14 రోజుల రిమాండ్

ఆర్థిక అక్రమాలకు పాల్పడిన కార్వీ ఎండీ పార్థసారథి రెడ్డికి పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టమర్ల షేర్లను వారికి తెలియకుండానే తనఖా పెట్టి బ్యాంకుల నుంచి తీసుకున్న పార్థసారథి రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా.. ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

పార్ధసారథిపై హైదరాబాద్‌ సీసీఎస్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. 780 కోట్ల రుణాల ఎగవేత కేసులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రెండు కేసులు, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ ఒక కేసు పెట్టాయి. కస్టమర్ల షేర్లు తనఖా పెట్టే అధికారం స్టాక్‌ బ్రోకింగ్‌కు కంపెనీకి లేదు. కస్టమర్ల షేర్లను తనఖా పెట్టి 780 కోట్లు రుణాలు తీసుకున్న పార్ధసారథిపై.. 720 కోట్లు దుర్వినియోగం చేశాడన్న అభియోగాలు ఉన్నాయి.

karvy md parthasarathy reddy remanded for 14 days

గతంలో కార్వీపై నిషేధం విధించింది సెబీ. అప్పటికే కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ కంపెనీ ద్వారా వేల కోట్లు షేర్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేశారు. నిషేధం విధించడంతో బ్యాంకులు ఇచ్చిన రుణాలను రాబట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత కేసులు నమోదయ్యాయి. దీనిపై విచారణ జరిపిన సీసీఎస్‌ పోలీసులు పార్ధసారథిని అరెస్ట్‌ చేశారు. ఈ కేసును సీసీఎస్‌ పోలీసులతో పాటు...ఈడీ, సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌లు దర్యాప్తు చేస్తున్నాయి.

కార్వీపై సెబీ నిషేధంతో షేర్లు తనఖా పెట్టుకుని రుణాలు ఇచ్చిన బ్యాంకులు... కార్వీ ఎండీ పార్ధసారథిపై ఫిర్యాదు చేశాయన్నారు హైదరాబాద్‌ సీసీసీఎస్‌ డీసీపీ అవినాష్‌ మొహంతి. కస్టమర్ల షేర్లను కంపెనీ షేర్లుగా చూపడంతో కార్వీ ఎండీపై మూడు కేసులు నమోదయ్యాయని, దీంతో దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్‌ చేశామన్నారు.

హైద‌రాబాద్‌లో ఆర్థిక సేవ‌లు అందిస్తున్న సంస్థ కార్వీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ పార్ధసార‌ధిని సీసీఎస్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నార‌ు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల‌ను చెల్లించ‌లేద‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. బ్యాంకు అధికారుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించి.. తాను తీసుకున్న రుణాల‌ను అక్ర‌మంగా వాడుకున్నార‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

స‌కాలంలో రుణ వాయిదాలు చెల్లించ‌క‌పోవ‌డంతో హైద‌రాబాద్ పోలీసుల‌కు హెచ్‌డీఎఫ్‌సీ, ఇండ‌స్ ఇండ్ బ్యాంకుల అధికారులు ఫిర్యాదు చేశారు. రుణాల చెల్లింపుల్లో జాప్యంపై ప్ర‌స్తుతం హైద‌రాబాద్ సీసీఎస్ పోలీసులు ఆయ‌న‌ను ప్ర‌శ్నిస్తున్న‌ట్లు తెలియ‌వ‌చ్చింది. పార్ధ‌సార‌ధి రూ.780 కోట్ల మేర‌కు రుణాలు తీసుకున్నట్లు స‌మాచారం. వీటితోపాటు రూ.720 కోట్ల క‌స్ట‌మ‌ర్ల నిధుల‌ను కూడా తారుమారు చేశార‌ని ఆయ‌న‌పై అభియోగాలు ఉన్నాయి. ఇంత‌కుముందు షేర్ల అక్ర‌మ లావాదేవీల‌కు పాల్ప‌డినందుకు స్టాక్ మార్కెట్ల నియంత్ర‌ణ సంస్థ సెబీ.. గ‌తంలో కార్వీపై నిషేధం విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+